Flex Fuel : పెట్రోల్ ధరల పెరుగుదల, ముడిచమురు దిగుమతులపై ఆధారపడటం, వాహన కాలుష్యం ఈ మూడు సమ స్యలు భారత ఆర్ధిక వ్యవస్థకు, ప్రజల జీవనానికి సవాలుగా మారుతున్నాయి.
ఇంధన అవసరాలు పెరుగుతున్న కొద్దీ విదేశీ చమురుపై ఆధారపడటం దేశ ఆర్థిక భద్రతపై ప్రభా వం చూపుతోంది. మరోవైపు, పెట్రోల్, డీజిల్ ధరల్లో వచ్చే మార్పులు సామాన్యుల + కుటుంబ బడ్జెట్‌ను దెబ్బతీస్తున్నా యి. ఈపరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగా న్ని ప్రోత్సహించడం అనివార్యంగా మారింది. ఈ దిశగా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు సం బంధించి కేంద్రప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ నిర్ణయం ఇంధన రంగంలో ఎలాంటి మార్పు లకు దారితీస్తుంది? వాహనదారులకు ఎంతవరకు ప్రయోజ నం చేకూరుతుంది? రైతుల ఆదాయం, పర్యావరణ పరిరక్షణ కు ఇది దోహదపడుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. కేంద్ర రోడ్డు ర వాణా, రహదా రుల మంత్రిత్వ శాఖ 2026 అక్టోబర్ 26న ప్రకటించిన నిబంధనల సవరణలో భాగంగా, అధిక ఇథనాల్ శాతం కలిగిన ఇంధనాలను ఉపయోగించే వాహనాల ఉద్గార ప్రమాణాల్లోని ‘ఇ100’ను కూడా చేర్చారు. దీనివల్ల నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఫ్లెక్స్ ఫ్యూయ ల్ వాహనాలకు ‘ఇ85’తోపాటు ‘ఇ100’ ఇంధనాన్ని ఉప యోగించేందుకు ధ్రువీకరణ పొందే మార్గం సుగమమైంది. ఇది ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని విస్తరించే ప్రయత్నంలో ఒక ముందడుగుగా చెప్పవచ్చు. అయితే, ఈ మార్పును అన్ని పెట్రోల్ వాహనాలకు వర్తించే సాధారణ అనుమతిగా భావించకూడదు.
Flex Fuel
Flex Fuel : అధిక ఇథనాల్ శాతానికి అనుగుణంగా
అధిక ఇథనాల్ శాతాన్ని తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించి, నిర్దేశిత ప్రమాణా లకు అనుగుణంగా ధ్రువీకరించిన వాహనాలకే ఈ వెసులు బాటు ఉంటుంది. ప్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ప్రత్యేకత ఏమిటంటే, అవి పెట్రోల్‌తోపాటు వివిధ నిష్పత్తుల్లో పెట్రోల్, ఇథనాల్ మిశ్రమాలను ఉ పయోగించ గలిగేలా రూపొందించబడతాయి. ఇ20లో 20శాతం ఇథనాల్ ఉండగా, ఇ85లో 85శాతం ఇథనాల్ ఉంటుంది. ఇ100 అనేది దాదాపు పూర్తిగా ఇథనాల్‌తో కూడిన ఇంధనాన్ని సూచిస్తుంది. ఈ వాహనాల్లో ఇంజిన్, ఇంధన సరఫరా వ్యవస్థలు అధిక ఇథనాల్ శాతానికి అనుగుణంగా పనిచేసే లా ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తారు. ఇంధన మిశ్ర మంలో మార్పులకు అనుగుణంగా ఇంజిన్ పనితీరును సర్దు బాటు చేసుకునే సామర్థ్యం వీటి ప్రత్యేకత. అయితే, సాధా రణ పెట్రోల్ వాహనాల్లో ఇలాంటి ఇంధనాలను యథేచ్చగా ఉ స్త్రీ పయోగించడానికి వీల్లేదు. వాహన తయారీదారు సూచనలు, నిర్దేశిత ప్రమాణాలను తప్పనిసరిగాపాటించాలి. భారత దేశం ముడిచమురు అవసరాల్లో గణనీయమైన భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పుడు దేశ దిగుమతి బిల్లు పెరగడమే కాకుండా, విదేశీ మారకద్రవ్య నిల్వలపై ఒత్తిడి ఏర్పడుతుంది.
జాతీయ ఆర్థిక భద్రతకు మేలు
యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సరఫరామార్గాల్లో అంతరాయాలు ఏర్పడినప్పుడు ఈసమస్య మరింత తీవ్రమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయంగా ఉత్పత్తి చేసే ఇథనాల్న రవాణా రంగంలో వినియోగించ డంవల్ల ముడిచమురుపై ఆధారపడటాన్ని కొంతవరకు తగ్గిం చవచ్చు. ఇంధన అవసరాల్లో దేశీయ వనరుల వాటా పెరగ డం జాతీయ ఆర్థిక భద్రతకు మేలుచేస్తుంది. అయితే, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ప్రవేశంతోనే చమురు దిగుమ తుల సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని భావించడం అతిశ యోక్తే. ఈవాహనాల సంఖ్య, ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం, ఇంధన ధరలు, సరఫరావ్యవస్థల అభివృద్ధిపైనే వాస్తవ ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. ఇథనాల్ ఉత్పత్తి వ్యవసాయ రంగానికి కొత్త అవకాశాలను అందించగలదు. చెరకు, మొక్కజొన్న, మొలాసిస్ వంటి ముడిపదార్థాల నుంచి ఇథనాలు తయారు చేయవచ్చు. వీటికి డిమాండ్ పెరిగితే రైతులకు అదనపు మార్కెట్ లభించే అవకాశం ఉంటుంది. ఇథనాల్ తయారీ పరిశ్రమలు విస్తరించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరగవచ్చు. వ్యవసాయాన్ని ఆహార ఉత్పత్తికే పరిమితం చేయకుండా, దేశ ఇంధన అవసరాలను తీర్చడంలోనూ భాగస్వామ్యం చేయడం ఆర్థికంగా ఉపయోగకరమే. కానీ ఈ ప్రక్రియలో రైతులకు నిజంగా ఎంత ప్రయోజనం చేకూ రుతుందన్నది కీలకమైన ప్రశ్న. పంటలకు గిట్టుబాటుధరలు లభిస్తున్నాయా? ఇథనాల్ తయారీ సంస్థలు రైతులకు సకా లంలో చెల్లింపులు చేస్తున్నాయా? వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో స్థిరత్వం ఉంటుందా? వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. అదే సమయంలో ఆహార భద్రతను విస్మ రించకూడదు.
Flex Fuel
సాంకేతికతలను ప్రోత్స హించడం
ఇంధన ఉత్పత్తి కోసం పంటల సాగు విస్తరిం చినప్పుడు ఆహార పంటలకు అందుబాటులో ఉండే భూమి, నీరు, వ్యవసాయ వనరులపై ఒత్తిడి పెరిగేప్రమాదం ఉంది. ముఖ్యంగా నీటి కొరత ఉన్నప్రాంతాల్లో అధికనీరు అవసర మయ్యే పంటలను విన్నతంగా ప్రోత్సహిస్తే సాగునీటి సమ న్యలు తీవ్రమవుతాయి. కాబట్టి ఇథనాల్ ఉత్పత్తిని పెంచే విధానాలు పంటల వైవిధ్యం, నీటిపొదుపు, ఆహార భద్రతకు అనుగుణంగా ఉండాలి. వ్యవసాయ వ్యర్థాలు, మిగులు పదా ర్థాల నుంచి ఇంధనం తయారుచేసే సాంకేతికతలను ప్రోత్స హించడం కూడా ఈ దిశగా ఉపయోగకరంగా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ ఫ్లెక్స్ ఫ్యూయల్వాహ నాల సామర్థ్యాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలి. అధిక ఇథనాల్ మిశ్రమాలను ఉపయోగించే వాహనాలు కొన్ని రకాల కాలుష్య ఉద్గారాలను తగ్గించగలిగినా, మొత్తం పర్యా వరణ ప్రయోజనం ఇథనాల్ ఉ త్పత్తి విధానంపై ఆధారపడి ఉంటుంది. పంటల సాగు నుంచి ఇంధన తయారీ, రవాణా, వాహన వినియోగం వరకు ప్రతి దశలో వినియోగించే శక్తి, విడుదలయ్యే ఉద్గారాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇథ నాల్ ఉత్పత్తి కోసం అధికశక్తి వినియోగిస్తే లేదా పర్యావర ణానికి హాని కలిగించేపద్ధతులు అనుసరిస్తే ఆశించిన ప్రయో జనాలు తగ్గిపోవచ్చు. అందువల్ల వాహనం నుంచి వెలువడే కాలుష్యాన్ని మాత్రమే కాకుండా, ఇంధనం ఉత్పత్తి నుంచి వినియోగం వరకు మొత్తం ప్రక్రియను పరిగణనలోకి తీసుకొని పర్యావరణ ప్రయోజనాలను అంచనా వేయాలి.
-టి. శ్రీనివాస్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

