Prabhas Fauzi : పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న 'ఫౌజీ' చిత్రంలో ఒక సర్‌ప్రైజింగ్ కాస్టింగ్ విశేషం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్ర కోసం అలనాటి స్టార్ హీరోయిన్, సీనియర్ నటి జయప్రదను ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. కథలో ఈ తల్లి పాత్ర నిడివి చాలా ఎక్కువే ఉండటమే కాకుండా, తల్లి-కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో భావోద్వేగభరితంగా (Emotional) హృదయాలను హత్తుకునేలా ఉంటాయని సమాచారం. హను రాఘవపూడి సినిమాల్లో ఉండే భావోద్వేగాల తీవ్రత తెలిసిందే కాబట్టి, ప్రభాస్-జయప్రద కాంబినేషన్ వెండితెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Fauzi Movieచివరి దశకు షూటింగ్ - డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల?
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ నాన్‌స్టాప్ షెడ్యూళ్లతో షూటింగ్‌ను చివరి దశకు తీసుకువచ్చినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని పనులను త్వరగా పూర్తి చేసి, ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

