Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫ్యాటీ లివర్ సమస్యకు నారింజ పండ్లతో చెక్

ఫ్యాటీ లివర్ సమస్యకు నారింజ పండ్లతో చెక్

వార్త 5 months ago

Benefits of Orange: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల 'ఫ్యాటీ లివర్' (కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం) సమస్య సర్వసాధారణంగా మారింది.

అయితే, ఈ సమస్యకు పరిష్కారం మనకు ప్రకృతి సిద్ధంగా లభించే నారింజ పండ్లలో ఉందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిరోజూ నారింజ పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

Read also: Eye care tips: లాసిక్ సర్జరీతో కళ్లద్దాలకు గుడ్ బై చెప్పేయండి

 Check fatty liver problem with oranges

Benefits of Orange: పరిశోధన ఏం చెబుతోంది?

‘న్యూట్రియెంట్స్’ జర్నల్‌లో ప్రచురించిన కథనం ప్రకారం.. 30 నుండి 65 ఏళ్ల వయస్సు గల 60 మందిపై శాస్త్రవేత్తలు ఈ పరీక్షలు నిర్వహించారు. వీరిని రెండు బృందాలుగా విభజించి, ఒక బృందానికి నాలుగు వారాల పాటు ప్రతిరోజూ 400 గ్రాముల గింజలు లేని నారింజ పండ్లను అందించారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ బృందంలోని వ్యక్తులలో కాలేయ కొవ్వు తగ్గడమే కాకుండా, కాలేయం పనితీరు కూడా మెరుగుపడటం గమనార్హం.

నారింజలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు కాలేయంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడటంతో పాటు, కొవ్వు కరగడానికి సహాయపడతాయి. అయితే, కేవలం నారింజ పండ్లతోనే ఈ సమస్య పూర్తిగా నయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు సరైన వ్యాయామం, సమతుల్య ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అత్యవసరమని వారు సూచిస్తున్నారు. ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రంగా ఉన్నవారు వైద్యుల సలహా మేరకు నారింజ పండ్లను తమ డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

టీతో బిస్కెట్లు తింటున్నారా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha