Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తత

గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తత

వార్త 2 weeks ago

Congress Leaders Fighting : హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో ఊహించని విధంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పార్టీ అగ్రనేతలు, మంత్రుల సమక్షంలోనే ఇద్దరు కీలక నేతలు ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లడం అక్కడున్న వారందరినీ షాక్‌కు గురిచేసింది. నాంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, పార్టీ మైనారిటీ సెల్ నాయకుడు ఉస్మాన్ హజీల మధ్య ప్రొటోకాల్ విషయంలో ఒక్కసారిగా వివాదం రేగింది. ఒకరిని మించి మరొకరు వాగ్వాదానికి దిగడంతో మాట మాట పెరిగి, పరిస్థితి చేతులు దాటిపోయింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన ఉస్మాన్ హజీ, ఫిరోజ్ ఖాన్ చెంపపై బలంగా కొట్టడంతో ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మహ్మద్ అజహరుద్దీన్ వంటి వీఐపీలు వేదికపై ఉండగానే ఈ గొడవ జరగడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

Read Also ; ఇందిరమ్మ జీవిత బీమా పథకం: జూన్ 2 నుంచి ప్రారంభం

వీహెచ్‌పైకి దూసుకెళ్లిన కార్యకర్తలు

ఈ ఊహించని భౌతిక దాడితో గాంధీభవన్‌లో ఒక్కసారిగా గందరగోళం, నెట్టింపులు చోటు చేసుకున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు (వీహెచ్) చొరవ తీసుకుని ఇరువర్గాలను శాంతింపజేయడానికి, గొడవను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే పరిస్థితి అప్పటికే అదుపు తప్పడంతో, కొంతమంది కార్యకర్తలు ఏకంగా సీనియర్ నేత అయిన వీహెచ్‌పైకే దూసుకెళ్లడం గమనార్హం. మంత్రులు, సీనియర్ల ముందే పార్టీ క్రమశిక్షణను దిగజార్చేలా నేతలు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరుపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నాంపల్లి కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో ఉన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు ఈ ప్రొటోకాల్ వివాదం సాకుతో ఇలా బహిరంగంగా వీధిన పడ్డాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

భూపాలపల్లిలో పిడుగుపాటుకు యువకుడు బలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha