Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గల్ఫ్ దేశాల ఒత్తిడి.. ట్రంప్ వెనకడుగు వేసినా బంగారం ఎందుకు పెరిగింది?

గల్ఫ్ దేశాల ఒత్తిడి.. ట్రంప్ వెనకడుగు వేసినా బంగారం ఎందుకు పెరిగింది?

వార్త 4 days ago

Gold rate today : పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్‌పై చేపట్టాలనుకున్న సైనిక చర్యకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా బ్రేకులు వేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో, మార్కెట్లో అనిశ్చితి పెరిగి బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.

గత మూడు రోజుల నుండి వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి రేట్లు మే 19న ఒక్కసారిగా పెరగడంతో కొనుగోలుదారులకు షాక్ తగిలింది.

హైదరాబాద్‌లో బంగారం ధరలు (10 గ్రాములకు):

  • 24 క్యారెట్ల మేలిమి బంగారం: ఒక్కరోజులోనే రూ. 820 మేర పెరిగి, ప్రస్తుతం తులం ధర రూ. 1,57,040 వద్దకు ఎగబాకింది.
  • 22 క్యారెట్ల ఆభరణాల బంగారం: రూ. 750 పెరగడంతో ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ. 1,43,950 వద్ద ట్రేడవుతోంది.
  • తనిష్క్ జువెలరీస్ రేట్లు: ప్రముఖ సంస్థ తనిష్క్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర స్వల్ప తేడాతో రూ. 1,43,450 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Read Also: అమెరికా ఆంక్షలతో సంబంధం లేదు..రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ స్పష్టత

 Gold rate today

స్థిరంగా కొనసాగుతున్న వెండి:

బంగారం ధరలు పెరిగినప్పటికీ, వెండి ధర ఈరోజు స్థిరంగా ఉండి స్వల్ప ఊరట కల్పించింది. కిందటి రోజు ఒకేసారి రూ. 10,000 పెరిగిన వెండి, ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ రూ. 3,00,000 రికార్డు స్థాయి వద్దే విక్రయించబడుతోంది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,542 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ 76.25 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇరాన్‌పై సైనిక ముప్పు పూర్తిగా తొలగకపోవడంతో పెద్ద ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతుండటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నార్వే పర్యటనలో మోడీ బిజీ బిజీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha