Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గణేష్ నిమజ్జన శోభాయాత్రలో విషాదం.. ట్రక్ కింద పడి యువకుడు మృతి!

గణేష్ నిమజ్జన శోభాయాత్రలో విషాదం.. ట్రక్ కింద పడి యువకుడు మృతి!

వార్త 1 week ago

Ganesh Procession Accident: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ సమీపంలో శుక్రవారం గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఊహించని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వినాయక విగ్రహ నిమజ్జనం కోసం తరలిస్తున్న ఊరేగింపు వాహనం కిందపడి 20 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

పండుగ వాతావరణంతో కోలాహలంగా సాగుతున్న శోభాయాత్రలో ఈ ఘటన జరగడంతో స్థానికులు, భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Read Also : Hyderabad ganesh immersion: ఇరవై వేల బలగాలతో భాగ్యనగరం భారీ బందోబస్తు

 Tragedy during Ganesh immersion procession… Youth dies after falling under a truck!

Ganesh Procession Accident: లాఠీఛార్జ్ భయంతో ట్యాంకర్ పైకి ఎక్కే క్రమంలో ప్రమాదం

శోభాయాత్ర సమయంలో డ్యాన్స్ చేస్తున్న యువకుల సమూహాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు కొడతారనే భయంతో తప్పించుకునేందుకు సదరు యువకుడు వేగంగా వెళ్లి పక్కనే ఉన్న ట్యాంకర్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడిపోవడంతో, వెనుక నుంచి వస్తున్న ఊరేగింపు ట్రక్ చక్రాల కిందపడి తీవ్రగాయాలతో మరణించినట్లు ప్రాథమిక సమాచారం.

యువకుడి అకాల మరణంతో అతని తోటి స్నేహితులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఖైరతాబాద్ పరిసర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి విషమించకుండా ఉండేందుకు పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి, ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

నర్సింగ్‌ విద్యార్థిని మృతి..పెళ్లికి నిరాకరించడంతోనే హత్య?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha