Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గణేష్ నిమజ్జనం కోసం భాగ్యనగరం రెడీ.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే

గణేష్ నిమజ్జనం కోసం భాగ్యనగరం రెడీ.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే

వార్త 1 week ago

Khairatabad Ganesh Immersion: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు నిమజ్జన శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాయి.

ఈ నెల 25న శుక్రవారం అనంత చతుర్దశి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతితో పాటు నగరంలోని వేలాది గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. గతేడాది ఎదురైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి నిమజ్జన ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Read Also :Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలకు బుధవారం రాత్రితో ముగింపు

23 అర్ధరాత్రితో ఖైరతాబాద్ గణపతి దర్శనాలు

ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర ఖైరతాబాద్ మహాగణపతి కొలువుదీరాడు. మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులకు ఈ నెల 23న బుధవారం అర్ధరాత్రి వరకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. 24వ తేదీన దర్శనాలను నిలిపివేసి.. నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లను చేపట్టనున్నారు. షెడ్లు, బారికేడ్లు తదితర నిర్మాణాలను తొలగించి శోభాయాత్రకు మార్గం సిద్ధం చేయనున్నారు.

ఉదయం 6 గంటలకు శోభాయాత్ర.. మధ్యాహ్నానికే నిమజ్జనం

ఈ నెల 25న ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటలలోపే హుస్సేన్‌సాగర్‌లో మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిమజ్జన ప్రక్రియను ఒక్కరోజులోనే పూర్తి చేసేలా అధికారులు, ఉత్సవ నిర్వాహకులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

1.5 లక్షల మండపాలు.. 50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అంచనాల ప్రకారం.. నగరవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల గణేష్ మండపాలు ఏర్పాటు అయ్యాయి. ప్రధాన నిమజ్జన రోజున దాదాపు 50 లక్షల మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉందని సమితి అంచనా వేసింది. హుస్సేన్‌సాగర్‌తో పాటు సరూర్‌నగర్, కాప్రా, అమీన్‌పూర్ సహా 150కిపైగా ప్రాంతాల్లో, అలాగే 110 బేబీ పాండ్స్‌లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అదనపు క్రేన్లు, అప్‌గ్రేడ్ చేసిన ప్లాట్‌ఫారమ్‌లను సిద్ధం చేశారు. నిమజ్జన మార్గాల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ట్యాంక్‌బండ్ విషయంలో నిరసన

మరోవైపు ట్యాంక్‌బండ్ వైపు విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వకపోవడంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై నెక్లెస్ రోడ్ పరిసరాల్లో నిరసన చోటుచేసుకుంది. నిరసనకు దిగిన సమితి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Khairatabad Ganesh Immersion: 23 నుంచి 25 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

గణేష్ నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని 23 నుంచి 25వ తేదీ వరకు నగరంలోని పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. భక్తులు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha