Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గంజాయి విక్రయిస్తూ కోట్లు సంపాదించిన సెక్యూరిటీ గార్డు

గంజాయి విక్రయిస్తూ కోట్లు సంపాదించిన సెక్యూరిటీ గార్డు

వార్త 2 weeks ago

Ganja Racket : ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తి అక్రమ మార్గంలో కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన అతడు..

ఆ తర్వాత ఫుడ్ డెలివరీ సంస్థల్లోనూ ఉద్యోగం చేశాడు. కానీ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో గంజాయి విక్రయాలు ప్రారంభించి, చివరకు అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తిగా మారాడు. చిన్న చిన్న ప్యాకెట్లతో మొదలైన ఈ అక్రమ వ్యాపారం క్రమంగా భారీ స్థాయికి చేరింది. అసోంకు చెందిన భాస్కర్ హజారికా అనే వ్యక్తి ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. 2024లో మూడుసార్లు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లినా, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తన పద్ధతిని మార్చుకోలేదు. పైగా మరింత మందిని నెట్‌వర్క్‌లో చేర్చుకుంటూ వ్యాపారాన్ని విస్తరించాడు. నెలకు 40 నుంచి 50 కిలోల వరకు గంజాయి విక్రయిస్తూ, కేవలం పది నెలల్లోనే సుమారు రూ.2 కోట్ల విలువైన దందా సాగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Kerala Actor Of Assault : వైద్యుడి ఫోన్‌లో మహిళకు సంబంధించిన వీడియోలు లభ్యం

 Ganja Racket

అసోం నుంచి హైదరాబాద్‌కు.. ఉపాధి కోసం వలస

భాస్కర్ హజారికా అసోంలోని లఖింపూర్ జిల్లా నారాయణ్‌పూర్ ప్రాంతానికి చెందినవాడు. ఉపాధి కోసం 2014లో హైదరాబాద్‌కు వచ్చాడు. మొదట నగరంలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం సంపాదించాడు. సుమారు రెండేళ్ల పాటు ఈ పని చేశాడు. ఆ తర్వాత స్వగ్రామానికి వెళ్లిన భాస్కర్.. 2017 చివర్లో తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. కొంతకాలం స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థల్లో పనిచేశాడు. అనంతరం 2020 నుంచి 2023 వరకు మళ్లీ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించాడు. అయితే ఇదే సమయంలో అతడు మరో అక్రమ మార్గంలో అడుగుపెట్టాడు. 2020 నుంచే గంజాయి విక్రయాలు ప్రారంభించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

చిన్న ప్యాకెట్లతో మొదలైన గంజాయి వ్యాపారం

ప్రారంభంలో భాస్కర్ హజారికా చిన్న స్థాయిలో గంజాయి విక్రయాలు సాగించాడు. ఒడిశాకు చెందిన పితారంజన్ నాయక్ నుంచి గంజాయి తెప్పించుకుని హైదరాబాద్‌లో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయించేవాడు. మొదట పరిమితంగా సాగిన ఈ వ్యాపారం క్రమంగా విస్తరించింది. గంజాయి సరఫరాదారులతో పరిచయాలు పెంచుకోవడంతో పాటు స్థానికంగా విక్రయించే వ్యక్తులను కూడా తన నెట్‌వర్క్‌లో చేర్చుకున్నాడు. ఇలా కొద్దికాలంలోనే సాధారణ విక్రేత స్థాయి నుంచి సరఫరా వ్యవస్థను నిర్వహించే వ్యక్తిగా మారినట్లు పోలీసులు గుర్తించారు. భాస్కర్ హజారికాపై 2024లో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వరుసగా మూడు ఎన్‌డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసుల్లోనూ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే ప్రతిసారీ బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సాధారణంగా వరుసగా కేసులు నమోదైన తర్వాత నిందితులు తమ కార్యకలాపాలను నిలిపివేస్తారని భావించినా, భాస్కర్ మాత్రం గంజాయి వ్యాపారాన్ని కొనసాగించాడు.

Read Also hindi news: hindi.vaartha.com

రాప్తాడు పాఠశాల ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha