Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాం.. ఇప్పుడు మా దగ్గర డబ్బుల్లేవు - అంబటి

గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాం.. ఇప్పుడు మా దగ్గర డబ్బుల్లేవు - అంబటి

వార్త 3 weeks ago

YCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓటమి పాలైందని, ప్రస్తుతం తమ దగ్గర డబ్బులు కూడా లేవని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ పరిస్థితిని ఓటర్లు అర్థం చేసుకుని రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గత ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ప్రజల్లోకి వెళ్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈసారి తమకు ఎదురయ్యే ఎన్నికలను ఆర్గానిక్ పంటల మాదిరిగా ఆర్గానిక్ ఎలక్షన్స్‌గా అభివర్ణించారు. డబ్బు, ఇతర ప్రలోభాలకు తావులేకుండా ప్రజల మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

 Mega DSC protest

గెలిపిస్తే న్యాయమైన పాలన అందిస్తాం.. మేయర్ అభ్యర్థికి మద్దతు కోరిన మాజీ మంత్రి

గుంటూరు నగర రాజకీయాల గురించి ప్రస్తావించిన అంబటి రాంబాబు.. నిరుపేద కుటుంబానికి చెందిన ఆర్యవైశ్య మహిళా అభ్యర్థిని మేయర్ బరిలో నిలిపినట్లు తెలిపారు. ఆమెకు ఓటుతో పాటు నోటు కూడా ఇవ్వాలని ఓటర్లను కోరారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు న్యాయమైన, పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తామని, సామాన్యులకు పాలనలో భాగస్వామ్యం కల్పిస్తామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత వైసీపీ ఆర్థికంగా, రాజకీయంగా ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబటి వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అర్నబ్ తుపాను నష్టం.. చంద్రబాబు కీలక సమీక్ష

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha