TG Politics: తెలంగాణ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పదవికి సంబంధించి ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఆరు నెలల లోపు శాసనసభ లేదా మండలి సభ్యుడిగా ఎన్నికవ్వాలనే నిబంధన ఉంది.
అజారుద్దీన్ విషయంలో ఈ గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగియనుంది. అంటే మరో పది రోజుల్లోపు ఆయన ఎమ్మెల్సీగా నియమితులు కాకపోతే రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పుడు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
Read also: Pawan Kalyan Surgery: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై మోదీ ట్వీట్

Azharuddin and CM Revanth Reddy meeting
TG Politics: రంగంలోకి సీఎం రేవంత్: గవర్నర్‌తో కీలక చర్చలు
ఈ క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. లోక్ భవన్‌లో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా గవర్నర్ కోటాలో పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్సీ ఫైల్‌పై చర్చించారు. అజారుద్దీన్‌తో పాటు కోదండరాం పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. టెక్నికల్ సమస్యల వల్ల పెండింగ్‌లో ఉన్న ఈ నియామకాలను వెంటనే పూర్తి చేసి గెజిట్ విడుదల చేయాలని సీఎం గవర్నర్‌ను కోరారు. గడువు ముగియక ముందే ఆమోద ముద్ర పడితేనే అజారుద్దీన్ మంత్రిగా సురక్షితంగా కొనసాగుతారు.
జూబ్లీహిల్స్ లెక్కలే కారణమా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్‌ను వ్యూహాత్మకంగా మంత్రివర్గంలోకి తీసుకుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న మైనారిటీ ఓటర్ల మద్దతును కూడగట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025 ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ పట్టును పెంచుకోవడానికి ఆయనను మండలికి పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ గవర్నర్ నుంచి అనుమతి రాకపోతే, ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సి వస్తుంది. రానున్న కొద్ది రోజులు అజారుద్దీన్ రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

