Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ను వీడనున్న సల్మాన్ ఖాన్: కారణం ఏమిటంటే!

గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ను వీడనున్న సల్మాన్ ఖాన్: కారణం ఏమిటంటే!

వార్త 1 week ago

Salman Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కుటుంబ రక్షణ కోసం ఒక కీలకమైన మరియు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత 50 ఏళ్లుగా (1974 నుంచి) తాను నివసిస్తున్న ముంబై బాంద్రాలోని ప్రసిద్ధ 'గెలాక్సీ అపార్ట్‌మెంట్'ను ఖాళీ చేయాలని ఆయన నిశ్చయించుకున్నారు.

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వస్తున్న నిరంతర ప్రాణ బెదిరింపులు, గతంలో ఆయన ఇంటి వెలుపల జరిగిన కాల్పుల ఘటనల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ కుటుంబం కోసం పూర్తి స్థాయి హై-సెక్యూరిటీ వసతులతో కూడిన కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. ముంబైలోని బాంద్రా పరిధిలో గల చింబాయ్ తీర ప్రాంతంలో, సముద్రానికి అభిముఖంగా (సీ ఫేసింగ్) ఈ నూతన నివాసాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆరంతస్తుల లగ్జరీ బిల్డింగ్ నిర్మాణానికి మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఈ నెల 16న అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది.

Read Also: K Bhagyaraj Death:తమిళ దర్శకుడు భాగ్యరాజ్ మృతి పట్ల చిరంజీవి దిగ్భ్రాంతి

 Salman Khan

Salman Khan : 6 అంతస్తులు.. అత్యాధునిక భద్రతా వలయం

సల్మాన్ ఖాన్ నిర్మించబోయే ఈ కొత్త ఇల్లు దాదాపు 1,014 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండనుంది. గ్రౌండ్ ఫ్లోర్, స్టిల్ట్ పార్కింగ్ సదుపాయాలతో పాటు దీనిపై మరో ఆరు అంతస్తులను నిర్మిస్తారు. ప్రస్తుత గెలాక్సీ అపార్ట్‌మెంట్‌తో పోలిస్తే ఈ కొత్త నివాసంలో అత్యాధునిక నిఘా వ్యవస్థ, అభేద్యమైన భద్రతా ఏర్పాట్లు ఉండేలా ప్లాన్ చేశారు. ఈ భవన నిర్మాణం పూర్తయిన వెంటనే సల్మాన్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి మారుతారు. కృష్ణజింకల వేట వివాదం నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన భద్రతకు ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఇప్పటికే సల్మాన్ ఖాన్‌కు భారీ బలగాలతో కూడిన ‘వై ప్లస్’ (Y+) కేటగిరి భద్రతను కల్పిస్తోంది. అయినప్పటికీ, ముప్పు తీవ్రత దృష్ట్యా సొంత నివాసాన్ని మార్చడమే సురక్షితమని ఖాన్ కుటుంబం భావించింది.

Read hindi news : hindi.vaartha.com

వైజాగ్‌లో 'మా ఇంటి బంగారం' విజయోత్సవం.. సీక్వెల్ అనౌన్స్‌మెంట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha