Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గెలాక్సీ ఎస్26 అల్ట్రాపై భారీ ఆఫర్

గెలాక్సీ ఎస్26 అల్ట్రాపై భారీ ఆఫర్

వార్త 3 weeks ago

Samsung Galaxy S26 Ultra: శాంసంగ్ కంపెనీ తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా (Galaxy S26 Ultra) ధరను తగ్గించి వినియోగదారులకు గుడ్‌న్యూస్ తెలిపింది.

12జీబీ ర్యామ్‌తో వచ్చిన రెండు వేరియంట్లపై కంపెనీ రూ.15,000 వరకు ధరల కోత విధించింది. ఈ కొత్త ధరలు శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) వేదికగా అందుబాటులోకి వచ్చాయి.

Read Also : E20 Petrol: పెట్రోల్ నాణ్యతపై కేంద్రం కఠినం: క్లోరైడ్ నిబంధనలు చట్టబద్ధం!

 Huge offer on Galaxy S26 Ultra

Samsung Galaxy S26 Ultra: వేరియంట్ల వారీగా కొత్త ధరలు

  • 12GB + 256GB వేరియంట్: ప్రారంభంలో ఈ మోడల్ ధర రూ.1,39,999 కాగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత రూ.1,24,999కే లభిస్తోంది.
  • 12GB + 512GB వేరియంట్: లాంచ్ సమయంలో రూ.1,59,999గా ఉన్న ఈ వేరియంట్ ధర తగ్గింపుతో రూ.1,44,999కి తగ్గింది.

బ్యాంక్ ఆఫర్లు, అదనపు తగ్గింపు

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.4,000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 256జీబీ వేరియంట్‌ను రూ.1,20,999లకే పొందవచ్చు. అంటే మొత్తంమీద వినియోగదారులు రూ.19,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 25న భారత్‌లో విడుదలైంది. 120Hz రిఫ్రెష్‌రేట్‌తో கூடிய 6.9 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫర్ గెలాక్సీ ప్రాసెసర్, కొత్త ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్ మరియు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ వంటి శక్తివంతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

రూ. 1.5 లక్షల ధరతో ఐఫోన్ 18 ప్రో? లీకైన మైండ్ బ్లావింగ్ ఫీచర్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha