Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గెలిచినా అసంతృప్తిగా ఉన్న మెస్సీ.. జట్టు ఆటపై కెప్టెన్ సీరియస్ కామెంట్స్

గెలిచినా అసంతృప్తిగా ఉన్న మెస్సీ.. జట్టు ఆటపై కెప్టెన్ సీరియస్ కామెంట్స్

వార్త 6 days ago

Messi Comments on Team: ఫిఫా ప్రపంచకప్‌ 2026 (FIFA World Cup 2026) రౌండ్ ఆఫ్ 32లో పసికూన కేప్‌వెర్డేపై డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా 3-2 తేడాతో అతికష్టం మీద విజయం సాధించి ప్రీక్వార్టర్స్ (రౌండ్ ఆఫ్ 16) లోకి అడుగుపెట్టినప్పటికీ..

జట్టు ప్రదర్శనపై కెప్టెన్ లియోనెల్ మెస్సీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ గెలిచిన ఆనందం కంటే, జట్టు ఆడిన తీరులో ఉన్న లోపాలు తనను కలవరపెడుతున్నాయని మెస్సీ వ్యాఖ్యానించాడు. నాకౌట్ లాంటి అత్యంత కీలక దశకు ముందు ఇలాంటి పొరపాట్లను తప్పకుండా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని సహచర ఆటగాళ్లను హెచ్చరించాడు.

Read Also:Argentina vs Cape Verde 3-2:మెస్సీ సేనకు చుక్కలు చూపించి, తృటిలో బోర్లాపడ్డ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్!

మయామి థ్రిల్లర్: అదనపు సమయంలో అదృష్టం!

మయామి వేదికగా శనివారం జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో నిర్ణీత సమయం ముగిసేసరికి అర్జెంటీనా, కేప్‌వెర్డే జట్లు 2-2 గోల్స్‌తో సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి (Extra Time) దారితీసింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో లియోనెల్ మెస్సీ కొట్టిన పదునైన కార్నర్ షాట్‌ను అర్జెంటీనా ప్లేయర్ రొమెరో హెడర్ ద్వారా గోల్‌గా మలిచే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ క్రమంలో కేప్‌వెర్డే ఆటగాడి చేతికి తగిలిన బంతి దురదృష్టవశాత్తూ నేరుగా వారి స్వంత గోల్‌ పోస్ట్‌లోకి (Own Goal) దూసుకెళ్లింది. ఈ అదృష్ట గోల్‌తో అర్జెంటీనా 3-2తో విజయాన్ని అందుకొని ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. నాకౌట్ తదుపరి మ్యాచ్‌లో అర్జెంటీనా బలమైన ఈజిప్ట్ (Egypt) జట్టుతో తలపడనుంది.

బంతిపై నియంత్రణ కోల్పోయాం: మెస్సీ విశ్లేషణ

మ్యాచ్ ముగిసిన అనంతరం లియోనెల్ మెస్సీ మీడియాతో మాట్లాడుతూ జట్టు లోపాలను నిర్మొహమాటంగా పంచుకున్నాడు. “మా ఆటలో కొన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ, చాలా తప్పులు కూడా చేశాం. మ్యాచ్ ప్రారంభంలోనే ఆధిక్యం సాధించిన తర్వాత మా ఆట మరింత మెరుగుపడుతుందని భావించాం. కానీ మైదానంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మేము బంతిపై నియంత్రణ కోల్పోయాం. ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యాం. వారు తమ శారీరక బలాన్ని ఉపయోగించుకుని మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు” అని మెస్సీ విశ్లేషించాడు. అలాగే కేప్‌వెర్డేను తాము తక్కువ అంచనా వేయలేదని స్పష్టం చేశాడు. గతంలో స్పెయిన్, ఉరుగ్వే వంటి మేటి జట్లను సైతం వణికించి ఆ జట్టు ఇంతదూరం వచ్చిందని, నాకౌట్ టోర్నీలలో ఏ జట్టూ విజయాన్ని అంత తేలికగా ఇవ్వదని మెస్సీ పేర్కొన్నాడు. ప్రస్తుతం తాము విశ్రాంతి తీసుకుని ఈజిప్ట్‌తో జరగబోయే తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెడతామని చెప్పాడు.

Messi Comments on Team: వరుసగా 8 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో గోల్స్.. మెస్సీ వరల్డ్ రికార్డ్!

ఈ మ్యాచ్‌లో జట్టు ఆట తీరుపై అసంతృప్తి ఉన్నప్పటికీ, మెస్సీ వ్యక్తిగతంగా ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్ 29వ నిమిషంలో మెస్సీ అద్భుతమైన గోల్ సాధించాడు. ఈ గోల్‌తో ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలోనే వరుసగా ఎనిమిది (8) మ్యాచ్‌ల్లో గోల్స్ సాధించిన తొలి ఫుట్‌బాల్ ఆటగాడిగా లియోనెల్ మెస్సీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ టోర్నమెంట్‌లో అర్జెంటీనా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా తన అజేయ యాత్రను కొనసాగిస్తోంది.

Epaper: epaper.vaartha.com

నేడే రెండో టీ20.. భారత్ బోణీ కొట్టేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha