Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గేమ్ ముగుస్తుందంటూ ఇరాన్ కు అమెరికా హెచ్చరిక

గేమ్ ముగుస్తుందంటూ ఇరాన్ కు అమెరికా హెచ్చరిక

వార్త 3 weeks ago

US - Iran War : ఇరాన్‌తో సాగుతున్న సైనిక, ఆర్థిక పోరాటం క్లైమాక్స్‌కు చేరుకుందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఇరాన్ సైనిక సామర్థ్యాలను దాదాపు 100 శాతం వరకు ధ్వంసం చేయడంతో పాటు, వారి సైనిక కర్మాగారాలను, అణు కార్యక్రమాలను పూర్తిగా నిర్వీర్యం చేశామని బెసెంట్ వెల్లడించారు.

ఈ క్రమంలో ఇరాన్‌పై పోరాటం ఇప్పుడు ‘ఎండ్ గేమ్’ దశకు చేరుకుందని, దీని ద్వారా శత్రువుపై క్షేత్రస్థాయి వ్యూహాలు దాటి తుది ఫలితం దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

 Iran Accuses US

నేటి నుంచే ‘డి-డే’: ఇరాన్ ఆర్థిక ములాలు తెంచేందుకు భారీ వ్యూహం

ఇరాన్‌ను ఆర్థికంగా పూర్తిగా ఒంటరిని చేయడమే లక్ష్యంగా నేటి నుంచి ‘డి-డే’ (D-Day) ఆర్థిక దాడి ప్రారంభమవుతుందని బెసెంట్ ప్రకటించారు. ఇప్పటివరకు ఏ ప్రత్యర్థి దేశంపైనా ప్రయోగించని అతిపెద్ద, అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షల వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇరాన్ ప్రభుత్వానికి నిధులు మరియు వనరులు సమకూరే ప్రతి ఆర్థిక జీవనాధారాన్ని పూర్తిగా తెంచివేయడానికి అమెరికాలోని అన్ని ప్రభుత్వ విభాగాలు, అధికారాలను వినియోగిస్తామని చెప్పారు. ఈ చర్యలతో ఇరాన్ ఇక కోలుకోలేని విధంగా ఆర్థిక దిగ్బంధంలో చిక్కుకుంటుందని అమెరికా హెచ్చరించింది.

అమెరికాకు కెనడా బిగ్ షాక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha