Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన ఓమ్నీ వ్యాన్.. ఆరుగురు మృతి

ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన ఓమ్నీ వ్యాన్.. ఆరుగురు మృతి

వార్త 3 weeks ago

UP Kushinagar Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక మారుతి ఓమ్నీ వ్యాన్, ఎదురుగా వస్తున్న ట్రైలర్ ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.

Read Also : Raptadu Girl Attack: డాక్టర్లు ఎం అంటున్నారంటే?

 Horrific accident: Omni van rams into a truck; six dead

UP Kushinagar Road Accident: నుజ్జునుజ్జయిన వ్యాన్.. ఆరుగురు బలి

ఖుషీనగర్ జిల్లా పరిధిలోని తరువా దిహ్ ప్రాంత సమీపంలో ఈ ఘోరం జరిగింది. ఎనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్న మారుతి ఓమ్నీ వ్యాన్, ఎదురుగా వస్తున్న ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ధాటికి వ్యాన్ ముందు భాగం తీవ్రంగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న ఆరుగురు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మృతి చెందిన వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. వేడుక ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘోరం జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. మరో వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు

వ్యాన్ శిథిలాల నుంచి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్య చికిత్స కోసం గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఘోర ప్రమాదం.. హైటెన్షన్ వైర్ తగిలి 8 మంది మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha