మాయమాటలతో నైనిటాల్‌కు తీసుకెళ్లి
Uttar Pradesh crime: లక్నోకు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడు ఫిబ్రవరి 17న అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. అతని స్నేహితుడి వదిన అతికా, ఆ బాలుడికి మాయమాటలు చెప్పి నైనిటాల్‌కు తీసుకెళ్లింది.
అక్కడ బాలుడిపై ఆమె లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. ఆ తర్వాత కొన్ని రోజులకు బాలుడు తిరిగి ఇంటికి చేరుకున్నాడు.
Read also: Italy Shooting: ఇటలీలో కాల్పుల కలకలం: వైశాఖి వేడుకల్లో ఇద్దరు భారతీయుల దారుణ హత్య

Woman arrested for assault on boy.
Uttar Pradesh crime: నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్
నైనిటాల్ పర్యటన నుండి తిరిగి వచ్చినప్పటి నుంచి ఆ బాలుడు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు యువతి బాలుడి నగ్న వీడియోలను తీసి, వాటిని చూపిస్తూ తీవ్రంగా బ్లాక్ మెయిల్ చేసినట్లు బాలుడు తన ఆవేదనను వివరించాడు.
నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది రోజుల క్రితం FIR నమోదు చేశారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన లక్నో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. చివరకు నిందితురాలు అతికాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
టీసీఎస్ నిదా ఖాన్ పరారీ.. పోలీసుల రాకను పసిగట్టి చాకచక్యంగా ఎస్కేప్!

