Medak: మెదక్ జిల్లా (పెద్ద శంకరంపేట) మండల కేంద్రమైన పెద్ద శంకరంపేట లోని శ్రీ గోదా సమేత లక్ష్మి వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు 24వ తేదీ నుండి రెండు రోజులపాటు ఘనంగా జరగనున్నాయి.
వార్షికోత్సవ వేడుకలకు ఆలయాన్ని రంగురంగుల దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 24వ తేదీశుక్రవారం నాడు గణపతి పూజ, పుణ్యా వచనం, నవగ్రహవాస్తు, మూల మంత్ర హోమము, 25వ తేదీ శనివారం నాడు అభిషేకాలు, శ్రీ గోదా సమేత లక్ష్మీ వెంకటేశాయ స్వామి కళ్యాణోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయం ధర్మకర్త విగ్రాo శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. స్వామివారి కల్యాణోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు.
Medak: Anniversary celebrations of Goda Sametha Lakshmi Venkateswara Swamy
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

