Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గోదావరి కాలుష్యంపై డిప్యూటి సీఎం సీరియస్.. నివేదికకు ఆదేశం

గోదావరి కాలుష్యంపై డిప్యూటి సీఎం సీరియస్.. నివేదికకు ఆదేశం

వార్త 2 weeks ago

Pawan Kalyan on Godavari Pollution: తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండో రోజు మంగళవారం విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని వెంకటనగరం వద్ద ఆంధ్రా పేపర్‌ మిల్స్‌కు సంబంధించిన కాలుష్య వ్యర్థాలు, రసాయన జలాలు నేరుగా గోదావరి నదిలో కలుస్తున్న పాయింట్‌ను ఆయన బోటులో వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పవిత్రమైన గోదావరి నదిలోకి ఎలాంటి ముందస్తు శుద్ధి లేకుండా పరిశ్రమల రసాయన వ్యర్థాలను నేరుగా వదలడంపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : AP Industrial Parks: ఏపీలో కొత్తగా 38 ఇండస్ట్రియల్ పార్కులు

 Deputy CM serious about Godavari pollution.. orders for report

Pawan Kalyan on Godavari Pollution: కలుషిత నీటి పరీక్షలకు ఆదేశం

గోదావరి నది కాలుష్యానికి గురవుతున్న తీరును స్వయంగా వీక్షించిన డిప్యూటి సీఎం.. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నదిలోకి విడుదలవుతున్న కలుషిత నీటి నమూనాలను తక్షణమే సేకరించి, ల్యాబ్‌ పరీక్షలకు పంపాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో కాలుష్య నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని, పర్యావరణాన్ని దెబ్బతీసే విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

రాబోయే పుష్కరాల నాటికి గోదావరిని కాలుష్య రహితంగా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా గోదావరి కాలుష్య నివారణకు మరియు నదిలోకి చేరే వ్యర్థాలను అడ్డుకునేందుకు ఒక ప్రత్యేక ‘ఎన్విరాన్‌మెంటల్ టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ఇప్పటికే ప్రకటించారు.

పర్యటనలో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు

డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరియు కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి. కృష్ణయ్య, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha