జగన్ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు
Atchannaidu : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కమీషన్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధించిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని చీపుర్లపాడులో రూ.10.51 కోట్లతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'నాకెంత.. నీకెంత' రాజకీయాలు చేశారంటూ విమర్శ
అధికారంలో ఉన్న సమయంలో "నాకెంత.. నీకెంత" అన్న విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజల డబ్బును దోచుకున్న ఆ "గొడ్డలి పార్టీకి" గత ఎన్నికల్లో ప్రజలే గట్టి బుద్ధి చెప్పారని అన్నారు. భవిష్యత్తులో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు.
రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న మంత్రి
చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానంతో కేవలం 23 నెలల్లోనే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని వెల్లడించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
Read also : Gates College Free EV Training: నిరుద్యోగులకు గేట్స్ కళాశాల బంపర్ ఆఫర్!
Atchannaiduనేరడి బ్యారేజీ పూర్తి చేస్తామన్న హామీ
శ్రీకాకుళం జిల్లాలో వలసలను అరికట్టాలంటే పరిశ్రమలు అవసరమని మంత్రి అన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.620 కోట్లు కేటాయించామని తెలిపారు. అలాగే జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేరడి బ్యారేజీని 2029 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

