Dailyhunt
గోల్డ్ బాండ్లతో లక్షకు రూ. 4.86 లక్షల లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం!

గోల్డ్ బాండ్లతో లక్షకు రూ. 4.86 లక్షల లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం!

వార్త 1 week ago

Gold: స్థిరమైన, సురక్షితమైన రాబడిని ఆశించే ఇన్వెస్టర్లకు సావరిన్ గోల్డ్ బాండ్లు కల్పవృక్షంలా మారాయి. 2018లో ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు కళ్లు చెదిరే లాభాలు దక్కాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా 2018-19 సిరీస్-I గోల్డ్ బాండ్ల తుది విమోచన ధరను ప్రకటించడంతో, ఎనిమిదేళ్ల కాలంలోనే ఇన్వెస్టర్లు ఏకంగా 386 శాతం రాబడిని అందుకున్నారు.

Read Also: Emergency Alert System:దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఫోన్లకు వచ్చిన అలర్ట్ మేసేజ్

 Gold bonds yield Rs. 4.86 lakh profit per lakh

Gold: అద్భుతమైన వృద్ధి – గణాంకాలు ఇవే

2018 మే 4న ఈ బాండ్లు జారీ అయినప్పుడు గ్రాము బంగారం ధర కేవలం రూ. 3,114 మాత్రమే. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత, అంటే మే 4, 2026న ఈ బాండ్లు మెచ్యూరిటీకి చేరుకున్నాయి. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం, ప్రస్తుతం విమోచన ధరను ఒక గ్రాముకు రూ. 14,901 గా నిర్ణయించారు. దీని ప్రకారం ఎనిమిదేళ్ల క్రితం లక్ష రూపాయలు పెట్టిన ఇన్వెస్టర్ల సొత్తు ఇప్పుడు సుమారు రూ. 4.86 లక్షలకు చేరుకుంది.

వడ్డీతో కలిపి డబుల్ ధమాకా

కేవలం బంగారం ధర పెరగడం వల్ల వచ్చే లాభమే కాకుండా, ఈ బాండ్లపై ప్రభుత్వం ఏటా 2.5 శాతం స్థిర వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి నేరుగా ఇన్వెస్టర్ల ఖాతాలో జమవుతుంది. మెచ్యూరిటీ సమయంలో అసలు మొత్తంతో పాటు తుది వడ్డీని కలిపి చెల్లిస్తారు. అంటే ధర పెరుగుదల ద్వారా వచ్చే లాభం, స్థిర వడ్డీ కలిపి ఇన్వెస్టర్లకు రెట్టింపు ప్రయోజనాన్ని చేకూర్చాయి.

పన్ను మినహాయింపు ప్రయోజనాలు

సావరిన్ గోల్డ్ బాండ్లలో ఉన్న మరో ప్రధాన ఆకర్షణ పన్ను వెసులుబాటు. వ్యక్తిగత ఇన్వెస్టర్లు జారీ సమయంలో బాండ్లు కొనుగోలు చేసి, పూర్తి ఎనిమిదేళ్ల కాలపరిమితి వరకు ఉంచుకుంటే, మెచ్యూరిటీ సమయంలో వచ్చే మూలధన లాభాల పై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, సెకండరీ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసినా లేదా గడువు ముందే విక్రయించినా ఈ మినహాయింపు వర్తించదని బడ్జెట్ 2026 నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha