Gold Import : నేడు జరగనున్న జీఎస్టీ (GST) కౌన్సిల్ సమావేశంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒకే బ్యాంకులోని వేర్వేరు బ్రాంచీల మధ్య జరిగే 'ఇంటర్-బ్రాంచ్ ఫండ్ ట్రాన్స్‌ఫర్' పై 18 శాతంగా ఉన్న జీఎస్టీని పూర్తిగా తొలగించాలని కేంద్రం యోచిస్తోంది.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే బ్యాంకింగ్ కార్యకలాపాలు మరింత సులభతరం కావడంతో పాటు, బ్రాంచీల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. బ్యాంకింగ్ రంగానికి ఇదొక పెద్ద ఊరటగా పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
gold and silver rates hyderabadబంగారం, వెండి దిగుమతులపై పన్ను మినహాయింపు రద్దు?
మరోవైపు, బంగారం, వెండి వంటి విలువైన లోహాల దిగుమతిపై బ్యాంకులకు ఇప్పటివరకు లభిస్తున్న పన్ను మినహాయింపులకు స్వస్తి చెప్పే ఆలోచనలో కౌన్సిల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై బ్యాంకులు ప్రీమియం మెటల్స్ దిగుమతి చేసుకునే సమయంలో 3 శాతం ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) చెల్లించాల్సి రావచ్చు. ఈ పన్ను మినహాయింపు రద్దు అమల్లోకి వస్తే, బ్యాంకుల దిగుమతి వ్యయం పెరుగుతుంది. తద్వారా స్థానిక మార్కెట్లో బంగారం, వెండి ధరలపై స్వల్ప ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

