Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Government Land Encroachment: సర్వే నంబర్ 993లో 'సర్కారు' భూమి కబ్జా

Government Land Encroachment: సర్వే నంబర్ 993లో 'సర్కారు' భూమి కబ్జా

వార్త 2 months ago

Government Land Encroachment: సర్వే నంబర్ 993లో 'సర్కారు' భూమి కబ్జా: ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. సామాన్యుడు గజం స్థలం ఆక్రమిస్తే జరిమానాలు విధించే అధికారులు, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి కళ్లముందే కబ్జాకు గురవుతున్నా 'నిమ్మకు నీరెత్తినట్లు' వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సర్వే నంబర్ 993లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలుస్తున్న అపార్ట్‌మెంట్ల నిర్మాణం ఇప్పుడు స్థానికంగా పెను దుమారం రేపుతోంది.

ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

ఈ భూ ఆక్రమణపై స్థానిక రాజకీయ నాయకులు గత కొంతకాలంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నర్సింహా గౌడ్, మాజీ కౌన్సిలర్ మరియు బీజేపీ నాయకులు ఎడ్ల రమేష్, బీజేపీ సీనియర్ నాయకులు ఆదెల్లి రవీందర్, నందారం రమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోకల శ్రీనివాస్, సత్యనారాయణ స్థానికులు పలుమార్లు జిల్లా కలెక్టరును కలిసి ఫిర్యాదు చేశారు. 'ప్రజావాణి' కార్యక్రమంలో వినతి పత్రాలు సమర్పించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఎంఆర్వో కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు తిరిగినా ఫలితం లేకపోవడంతో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Government Land Encroachment: విలేజ్ మ్యాప్ చెబుతోంది ఒకటయితే.. జరుగుతోంది మరొకటి!

'మేము ఇక్కడే పుట్టి పెరిగాము. మా తాతల కాలం నుండి ఏది ప్రభుత్వ భూమి, ఏది ప్రైవేటు భూమి అనే హద్దులు మాకు స్పష్టంగా తెలుసు. విలేజ్ మ్యాప్ పరిశీలిస్తే సర్వే నంబర్ 993 స్పష్టంగా ప్రభుత్వ భూమి అని కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?' అని స్థానిక నాయకులు మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నారు.

'Government' land encroachment in survey number 993

Government Land Encroachment: అధికారుల 'అవినీతి' హస్తం ఉందా?

ఎంతమంది ఫిర్యాదులు చేసినా, నిరసనలు తెలిపినా నిర్మాణ పనులు మాత్రం నిరాటంకంగా, మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి. దీని వెనుక అధికారులు కబ్జాదారుల మధ్య లోపయాకారి ఒప్పందాలు ఉన్నాయనే గుసగుసలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారులే కళ్లు మూసుకుంటే, ఇక సామాన్యులకు దిక్కెవరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పారదర్శకత నిరూపించుకోవాలి

ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే విచారణ జరిపి నిర్మాణాలను నిలిపివేయాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తమ పారదర్శకతను నిరూపించుకోకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Khammam Velugumatla Victims:వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha