Gummadidala: హరిద్వార్ వేదికగా వేలాది మంది సాధువులు, పీఠాధిపతులు, బ్రాహ్మణులు, ఉపాసకులు కలిసి గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని సంకల్పించారు.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 5500కు పైగా మండలాల్లో ఎమ్మార్వోలకు వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామి ఆలయం నుండి పాదయాత్ర బయలుదేరి గుమ్మడిదలలో తహసిల్దార్ పరమేశంకు వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపత్రాన్ని రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ప్రధాన మంత్రి దృష్టికి చేరేలా రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ రక్షకులు, గోరక్షకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

