Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్రీన్‌కార్డు ఉన్నా దేశం నుంచి గెంటేయొచ్చు.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

గ్రీన్‌కార్డు ఉన్నా దేశం నుంచి గెంటేయొచ్చు.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

వార్త 1 week ago

US Green Card: అమెరికాలో నివసిస్తున్న గ్రీన్‌కార్డు హోల్డర్లు (గ్రీన్‌కార్డ్ కలిగి ఉన్న విదేశీయులు), శాశ్వత నివాసితులకు (Lawful Permanent Residents) సంబంధించి యూఎస్ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన, కీలకమైన తీర్పును వెలువరించింది.

నైతిక దుష్ప్రవర్తన లేదా తీవ్ర నేరాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉంటే, గ్రీన్‌కార్డు ఉన్నప్పటికీ వారిని దేశం నుంచి బహిష్కరించే (Deportation) పూర్తి అధికారాలు ప్రభుత్వానికి ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Read also:France Music Fest: ఫ్రాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో భయానకం..అమ్మాయిలపై లైంగిక దాడులు

ఈ కీలక తీర్పు ద్వారా అమెరికా సరిహద్దు రక్షణ మరియు వలసల విభాగం బోర్డర్ ఏజెంట్లకు (Border Agents) మరిన్ని విశేష అధికారాలు లభించినట్లయింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్‌కార్డు హోల్డర్లు విదేశీ పర్యటనలు ముగించుకుని తిరిగి యూఎస్ వచ్చే సమయంలో.. ‘ఎంట్రీ పాయింట్ల’ (విమానాశ్రయాలు/సరిహద్దులు) వద్దే వారి ప్రవేశాన్ని నిరాకరించి, దేశం నుంచి వెళ్లగొట్టేందుకు ఈ జడ్జిమెంట్ పూర్తి అనుమతినిస్తోంది.

చైనా జాతీయుడు 'మక్ చోయ్' (Muk Choi Lau) కేసు నేపథ్యం

 Green card holders crime involving moral turpitude

ఈ చారిత్రాత్మక తీర్పు వెలువడటానికి చైనాకు చెందిన మక్ చోయ్ లూ (Muk Choi Lau) అనే గ్రీన్‌కార్డ్ హోల్డర్ కేసు ప్రధాన కారణమైంది.

  • నేరారోపణ – విదేశీ ప్రయాణం: చైనా పౌరుడైన మక్ చోయ్ 2007లో అమెరికా గ్రీన్‌కార్డు పొందాడు. అయితే, 2012లో న్యూజెర్సీలో అతడిపై నకిలీ ట్రేడ్‌మార్క్ దుస్తుల విక్రయానికి (Trademark Counterfeiting) సంబంధించిన క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో ఉండగానే అతడు తాత్కాలికంగా చైనాకు వెళ్లాడు.
  • ఎయిర్‌పోర్టులో నిరాకరణ: జూన్ 2012లో అతడు చైనా నుంచి తిరిగి అమెరికా విమానాశ్రయంలో దిగగా.. బోర్డర్ అధికారులు అతడిని దేశంలోకి శాశ్వతంగా అనుమతించకుండా ‘ఇమ్మిగ్రేషన్ పరోల్’ (Immigration Parole) కింద కఠిన షరతులతో తాత్కాలికంగా లోపలికి పంపారు. ఆ తర్వాత కోర్టులో మక్ చోయ్ తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు (Plead Guilty).
  • డిపోర్టేషన్ ఆర్డర్: దాంతో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అతడికి దేశ బహిష్కరణ (Removal Orders) నోటీసులు జారీ చేసింది. తాను చేసిన నకిలీ ట్రేడ్‌మార్క్ నేరం ‘నైతిక దుష్ప్రవర్తన’ (Crime Involving Moral Turpitude) కిందకు రాదని, బోర్డర్ ఏజెంట్లు తనను ఆపేటప్పుడు తనపై నేరం రుజువు కాలేదని మక్ చోయ్ కోర్టును ఆశ్రయించాడు. సెకండ్ సర్క్యూట్ కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అక్కడ అతడికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

సుప్రీంకోర్టు కీలక తీర్పు - జస్టిస్ క్లారెన్స్ థామస్ వ్యాఖ్యలు

ఈ కేసును విచారించిన యూఎస్ సుప్రీంకోర్టు బెంచ్ 6-3 మెజారిటీతో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ధర్మాసనం తరపున జస్టిస్ క్లారెన్స్ థామస్ (Justice Clarence Thomas) తీర్పును వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ (INA) ప్రకారం.. ఒక గ్రీన్‌కార్డ్ హోల్డర్ దేశంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో అతడు నైతిక దుష్ప్రవర్తన లేదా క్రిమినల్ నేరానికి పాల్పడ్డాడని నమ్మడానికి అధికారుల వద్ద ‘బలమైన కారణం’ (Reasonable Cause) ఉంటే సరిపోతుంది. బోర్డర్ అధికారులపై ఆ సమయంలోనే ‘స్పష్టమైన, తిరుగులేని ఆధారాలను’ (Clear and Convincing Evidence) చూపించాల్సిన భారం లేదు. తీవ్ర నేరారోపణలు ఉన్నప్పుడు వారిని ‘ఇన్‌అడ్మిసిబుల్’ (దేశ ప్రవేశానికి అనర్హులు) కింద పరిగణించి బహిష్కరించే అధికారం బోర్డర్ ఏజెంట్లకు ఉంటుంది.” ఈ తీర్పుతో గ్రీన్‌కార్డు ఉన్నప్పటికీ అమెరికా వెలుపలికి వెళ్లి వచ్చే విదేశీయులు ఎవరైనా నేర చరిత్ర కలిగి ఉంటే.. విమానాశ్రయం నుంచే నేరుగా డిపోర్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెరుచుకున్న హర్మూజ్ జలసంధి.. మెల్లగా కొనసాగుతున్న నౌకల రవాణా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha