Dailyhunt
Gruha Jyothi : గ్రేటర్ లో విస్తృతంగా గృహజ్యోతి లేఖల పంపిణీ

Gruha Jyothi : గ్రేటర్ లో విస్తృతంగా గృహజ్యోతి లేఖల పంపిణీ

వార్త 2 months ago
  • గృహ జ్యోతి లబ్దిదారులకు వ్యక్తిగతంగా లేఖలు పంపిన ఉప ముఖ్య మంత్రి శ్రీ భట్టి విక్రమార్క
  • ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్న విద్యుత్ అధికారులు సిబ్బంది.
  • గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు 11.38 లక్షల గృహజ్యోతి లబ్ధిదారులకు వ్యక్తిగతంగా లేఖలు.
  • గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ పేరుతో లేఖ పంపడంతో లబ్ధిదారుల సంతోషం.

హైదరాబాద్: తేదీ:13.01.2026: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహ జ్యోతి - 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం దాదాపు రెండేళ్లుగా విజయవంతంగా అమలవుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను చాటిచెప్పేందుకు, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు గృహ జ్యోతి లబ్ధిదారులకు వారి పేర్లతో వ్యక్తిగతంగా లేఖలు రాశారు.

ఈ లేఖలను TGSPDCL అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు 11 లక్షల గృహ జ్యోతి లబ్ధిదారులకు ఈ లేఖలు పంపిణీ చేస్తున్నారు. లేఖలలో ప్రతి వినియోగదారుడి పేరు, సర్వీస్ నంబర్ పొందుపరిచి ఉండటం విశేషం.

Siddipet: దుంపలపల్లి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన

లేఖలో, ఉచిత విద్యుత్ వల్ల వినియోగదారులకు ఆదా అవుతున్న మొత్తాన్ని పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన ఆర్థిక భారాన్ని ప్రభుత్వం పూర్తిగా భరిస్తోందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి గారు లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

వినియోగదారుల హర్షం: గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ పేరుతో వ్యక్తిగత లేఖ రాయడం, అదీ అధికారులు స్వయంగా ఇంటికి వచ్చి అందజేయడం పట్ల వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నాయో ఈ చర్య స్పష్టంగా చూపిస్తోందని, ఇది ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతాభావానికి నిదర్శనమని వారు అభిప్రాయపడుతున్నారు.

గృహ జ్యోతి లబ్ధిదారుల వివరాలు:
Circle No. of GJ Bene.
1 బంజారా హిల్స్ 38,837
2 హైదరాబాద్ సెంట్రల్ 74,551
3 సికింద్రాబాద్ 77,296
4 హైదరాబాద్ సౌత్ 1,08,078
5 రాజేంద్ర నగర్ 1,43,216
6 సంగారెడ్డి 2,23,236
7 సైబర్ సిటీ 77,193
8 మేడ్చల్ 1,24,014
9 సరూర్ నగర్ 1,30,162
10 హబ్సిగూడ 1,41,897
total 11,38,480

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha