Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గృహ రుణాలపై ఆర్బీఐ శుభవార్త

గృహ రుణాలపై ఆర్బీఐ శుభవార్త

వార్త 2 weeks ago

RBI home loan rules:సామాన్యుల సొంత ఇళ్ల కల సాకారం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. గ్రామీణ సహకార బ్యాంకుల్లో హోం లోన్ల నిబంధనలను సులభతరం చేస్తూ ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

ఈ తాజా నిర్ణయం ద్వారా గ్రామాల్లో నివసించే ప్రజలు తక్కువ వడ్డీకే పెద్ద మొత్తంలో గృహ రుణాలు పొందే అవకాశం లభించింది. ఇన్నాళ్లు ఈ బ్యాంకుల్లో రుణ పరిమితి తక్కువగా ఉండటంతో ఇబ్బంది పడిన మధ్యతరగతి ప్రజలకు ఇది నిజంగా పెద్ద ఊరట కలిగించే అంశం.

Read also: Rahul Gandhi On Amit Shah : విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం: అమిత్ షా రాజీనామా చేయాల్సిందే - రాహుల్ గాంధీ

 Home loans from rural cooperative banks

డిపాజిట్ల ఆధారంగా భారీగా పెరిగిన రుణాల పరిమితి

గ్రామీణ సహకార బ్యాంకుల్లో డిపాజిట్ల స్థాయిని బట్టి రుణాల మొత్తాన్ని భారీగా పెంచడం జరిగింది. ఇప్పుడు డిపాజిట్ల పరిమాణాన్ని బట్టి రూ.60 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు హోం లోన్లు మంజూరు చేయనున్నారు. ముఖ్యంగా రూ.1,000 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్న బ్యాంకులు తమ పరిధిలోని ఖాతాదారులకు అత్యధికంగా రూ.3 కోట్ల వరకు గృహ రుణం అందించే వెసులుబాటును కల్పించాయి.

RBI home loan rules:20 ఏళ్ల కాలపరిమితితో పాటు నిర్మాణంలో ఉన్న ఇళ్లకు మారటోరియం

పెద్ద మొత్తంలో లోన్లు తీసుకోవడంతో పాటు తిరిగి చెల్లించేందుకు తగిన సమయం కూడా కల్పించారు. రూ.1,000 కోట్లకు పైగా డిపాజిట్లు కలిగిన బ్యాంకుల్లో తీసుకునే రుణాలకు గరిష్టంగా 20 ఏళ్ల వరకు కాలపరిమితి వర్తిస్తుంది. అంతేకాకుండా, నిర్మాణంలో ఉన్న ఇళ్ల కోసం ప్రత్యేకంగా 24 నెలల వరకు మారటోరియం సౌకర్యం కూడా అందుబాటులో ఉంచడం విశేషం.

Epaper: epaper.vaartha.com

పరీక్షల్లో అక్రమాలపై త్రివర్ణ పతాకాలు, ప్లకార్డులతో అసెంబ్లీకి విద్యార్థుల ర్యాలీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha