Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గృహప్రవేశంకు వచ్చారు ..నేపాల్ టూర్ కు వెళ్లారు .. తర్వాత ఏమైందో తెలియడం లేదు

గృహప్రవేశంకు వచ్చారు ..నేపాల్ టూర్ కు వెళ్లారు .. తర్వాత ఏమైందో తెలియడం లేదు

వార్త 3 weeks ago

Nepal Flash Floods : 'చివరిసారిగా మంగళవారం సాయంత్రం మాట్లాడింది. టిబెట్ సరిహద్దుకు వెళ్తున్నాం.. బుధవారం ఉదయం వీసా వచ్చాక అక్కడి నుంచి బయల్దేరతాం అని చెప్పింది.

ఆ తర్వాత నుంచి మా అమ్మాయి ఫోన్ పనిచేయడం లేదు' అని ఆందోళన వ్యక్తం చేశారు కందిమళ్ల మహేందర్ రెడ్డి. నేపాల్‌లో ఆకస్మిక వరదల తర్వాత హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గరలోని వాస్తు కాలనీకి చెందిన కందిమళ్ల మహేందర్ రెడ్డి, ప్రేమలతల కుమార్తె సుహాసిని రెడ్డి ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె నేపాల్-టిబెట్ సరిహద్దులోని ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్లినట్టు చెప్పారని, ఆ తర్వాత సమాచారం తెలియడం లేదని వారు వివరించారు.

Read Also: Nepal Floods : ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈవో మిస్సింగ్!

 Nepal Flash Floods

Nepal Flash Floods : 15 ఏళ్లుగా ఆమె ఆస్ట్రేలియాలో ఉంటున్న భర్త సంజీవ్ రెడ్డి

నేపాల్‌లో వచ్చిన ఆకస్మిక వరదల తర్వాత ఆచూకీ తెలియనివారిలో సుహాసిని రెడ్డి కూడా ఒకరు. భర్త సంజీవ్ రెడ్డితో కలిసి సుమారు 15 ఏళ్లుగా ఆమె ఆస్ట్రేలియాలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్టు కుటుంబసభ్యులు చెప్పారు. వీరికి ఇద్దరు పిల్లలు.. శ్రీహాన్ రెడ్డి 11వ తరగతి చదువుతుండగా, సమయ్ ఒకటో తరగతి చదువుతున్నారు. కొత్త ఇంటి గృహ ప్రవేశం కోసం సమయ్‌తో కలిసి ఆగస్టు 19న సుహాసిని రెడ్డి ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వచ్చినట్టు ఆమె తండ్రి మహేందర్ రెడ్డి చెప్పారు. ”ఆగస్టు 23న మానసరోవర్ యాత్ర కోసం హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లి, అక్కడి నుంచి కాఠ్‌మాండూ వెళ్లింది. సోమవారం(ఆగస్టు 24) ఆమె స్నేహితురాలు నేరుగా కాఠ్‌మాండూకు రావడంతో ఇద్దరూ కలిసే ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో మాతో మాట్లాడింది. తర్వాత ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు” అని చెప్పారు మహేందర్ రెడ్డి. సెప్టెంబరు 14న సమయ్ పుట్టినరోజు. అది కూడా ఇక్కడే జరుపుకొని సెప్టెంబరు చివరలో ఆస్ట్రేలియా తిరిగివెళ్లాలని అనుకున్నారని సుహాసిని రెడ్డి మామ కె.రమేశ్ రెడ్డి చెప్పారు. ”మొదట్లో భర్తతో కలిసి సుహాసిని రెడ్డి న్యూజీలాండ్‌లో ఉండేవారు. తర్వాత ఆస్ట్రేలియాకు మారారు. త్వరలో తమకు పర్మినెంట్ రెసిడెన్సీ (పీఆర్) కూడా వస్తుందని మాతో చెప్పారు” అని వివరించారు రమేశ్ రెడ్డి. వీలైనంత త్వరగా సుహాసిని ఆచూకీ కనిపెట్టాలని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సెప్టెంబర్ లో వరుస సెలవులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha