Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
GT vs KKR మ్యాచ్ కంటే మా సినిమా బాగుంటుంది: తిరువీర్

GT vs KKR మ్యాచ్ కంటే మా సినిమా బాగుంటుంది: తిరువీర్

వార్త 2 months ago

Thiruveer: నటుడు తిరువీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పాపం ప్రతాప్' (Paapam Prathap). 1990ల నాటి పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ కామెడీ డ్రామాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తిరువీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also:Peddi Release : యశ్ కు పెద్ది భయపడుతున్నాడా ?

‘మసూద’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్, ఇప్పుడు పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్న ‘పాపం ప్రతాప్’ ఏప్రిల్ 17న (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఐపీఎల్ మ్యాచ్‌తో పోలిక

తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తిరువీర్ సినిమాపై తనకున్న నమ్మకాన్ని ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యక్తం చేశారు. ఈ సినిమా రిలీజ్ రోజున ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ (GT vs KKR) మధ్య మ్యాచ్ జరగనుంది. దీని గురించి తిరువీర్ మాట్లాడుతూ.. “క్రికెట్ ప్రేమికులందరికీ ఒక చిన్న మనవి. ఏప్రిల్ 17న జరిగే GT vs KKR మ్యాచ్ ఎంత రసవత్తరంగా ఉంటుందో నాకు తెలుసు, కానీ మా సినిమా ఆ మ్యాచ్ కన్నా బాగుంటుంది. మీరు థియేటర్లకు రండి, మిమ్మల్ని ఏమాత్రం నిరాశ పరచను” అని హామీ ఇచ్చారు. క్రికెట్ క్రేజ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించేందుకు తిరువీర్ వేసిన ఈ ప్లాన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Thiruveer: 90ల నాటి గోదావరి బ్యాక్‌డ్రాప్

1990ల నాటి గోదావరి జిల్లా నేపథ్యంలో సాగే ఈ కథను దర్శకుడు ఎస్.పి. దుర్గా నరేష్ ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. తన చిన్ననాటి స్నేహితురాలు బుజ్జమ్మ ( పాయల్ రాధాకృష్ణ )ను పెళ్లి చేసుకున్న ప్రతాప్‌కు, ఒక గ్రామ పంచాయితీలో జరిగిన అవమానం వల్ల ఎదురైన ఇబ్బందులే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. భార్య వదిలి వెళ్లిపోవడంతో ఊర్లో వాళ్లంతా ‘పాపం ప్రతాప్’ అని జాలి చూపిస్తూనే వెటకారం చేస్తుంటే, ఆ పరిస్థితులను ఎదురించి ప్రతాప్ ఎలా ‘వీర ప్రతాప్’గా మారాడు అనేది ఈ సినిమాలోని అసలు ట్విస్ట్. ఇందులో రాశి, అజయ్ ఘోష్, రఘుబాబు, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన 'ఉస్తాద్ భగత్ సింగ్'..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha