Dailyhunt
గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత

గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత

వార్త 2 weeks ago

Good Friday: లోక రక్షణార్థం దైవ కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమిపై కన్య గర్భాన సాధారణ మనిషిగా జన్మించారు. ప్రజలను అంధకారం నుంచి వెలుగు వైపు, చెడు మార్గం నుంచి సన్మార్గం వైపు నడిపించడమే ఆయన ప్రధాన లక్ష్యం.

దైవత్వాన్ని వీడి మానవ రూపంలో వచ్చిన ఆయన, మనుషుల కష్టసుఖాలను స్వయంగా అనుభవించారు. పాపపు ఊబిలో కూరుకుపోయిన వారిని దైవ చింతన వైపు మళ్లించేందుకు, శాంతి మరియు ప్రేమ సందేశాలను బోధిస్తూ అహర్నిశలు శ్రమించారు.

ద్రోహం మరియు అబద్ధపు నిందలు.. శిలువ శిక్షకు దారితీసిన పరిస్థితులు

యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ధన వ్యామోహంతో తన గురువుకే ద్రోహం తలపెట్టాడు. కొద్దిపాటి వెండి నాణేలకు ఆశపడి, యేసుక్రీస్తు తనను తాను యూదుల రాజుగా ప్రకటించుకున్నాడనే అబద్ధపు సాక్ష్యాన్ని సృష్టించి రోమా సైనికులకు అప్పగించాడు. ఆయన ఎదుగుదలను ఓర్వలేని కొందరు వ్యక్తులు ద్వేషంతో నిండిపోయి, రోమ్ చక్రవర్తి ముందు తప్పుడు సాక్ష్యాలు చెప్పారు. చివరకు వారందరి ఒత్తిడి మేరకు, ఎటువంటి తప్పు చేయని క్రీస్తుకు శిలువ వేయాలనే కఠిన శిక్షను ఖరారు చేశారు.

 Jesus Christ life history and sufferings

Good Friday: క్షమించే గుణమే క్రీస్తు సందేశం

శిలువపై అత్యంత వేదనను అనుభవిస్తున్న సమయంలో కూడా, తనను హింసించిన వారిని క్షమించమని వేడుకున్న గొప్ప మనసు యేసుక్రీస్తుది. ఆయన త్యాగం కేవలం ఒక మతానికి పరిమితం కాకుండా, విశ్వవ్యాప్తంగా ప్రేమ మరియు సహనానికి ప్రతీకగా నిలిచింది. నేటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆయన చూపిన బాటలో నడుస్తూ, తోటి వారిపై ప్రేమను పంచుతున్నారు. ఆయన మరణం మానవాళికి ఒక కొత్త నిరీక్షణను, పాప క్షమాపణను ప్రసాదించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఎప్పుడంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha