Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తనపై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన చదువు, రూపం, వేషధారణను లక్ష్యంగా చేసుకుని వైకాపా (YCP) నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.
ఇతరులపై ఇలాంటి చౌకబారు విమర్శలు చేసే ముందు, సొంత ఇంట్లోని మహిళలను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని ఆమె హితవు పలికారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో జరిగిన ఒక బహిరంగ సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Read also: PM Viksit Bharat Rozgar Yojana:విజయనగరంలో 'పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' జాతర
ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. నా దృష్టి కేవలం ప్రజాసేవపైనే!
గత ప్రభుత్వ హయాంలో తనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని, ఎన్నో ఆంక్షలు విధించారని హోంమంత్రి గుర్తుచేశారు. “ప్రస్తుతం అధికారంలో ఉన్నందున వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, నేను ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉన్నాను. నన్ను వ్యక్తిగతంగా దూషించే వారిని నేను అస్సలు పట్టించుకోను” అని అనిత స్పష్టం చేశారు.
రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితమని, ఆ తర్వాత అందరి ఉమ్మడి లక్ష్యం ప్రజాసేవ, సుపరిపాలన మాత్రమే కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు జరగాలన్నదే తన ఆకాంక్ష అని చెబుతూ.. గత రెండేళ్ల కాలంలో తాను ఎక్కడా అవినీతికి తావు ఇవ్వకుండా పారదర్శకంగా పనిచేశానని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

