Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం

గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం

వార్త 3 months ago

Gujarat players : ఐపీఎల్-19 (IPL 2026) ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు ఆటగాళ్లకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నరేంద్ర మోదీ స్టేడియం నుండి ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందితో కలిసి హోటల్‌కు బయలుదేరిన గుజరాత్ టైటాన్స్ అధికారిక బస్సులో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంజిన్ భాగం నుండి మంటలు చెలరేగి, క్షణాల వ్యవధిలోనే బస్సు మొత్తాన్ని దట్టమైన పొగలు కమ్మేసాయి. బస్సులో ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన భద్రతా సిబ్బంది మరియు డ్రైవర్ అత్యంత అప్రమత్తతతో వ్యవహరించారు. వాహనాన్ని వెంటనే రోడ్డు పక్కన నిలిపివేసి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారాల ద్వారా ఆటగాళ్లందరినీ ఏ విధమైన గాయాలు కాకుండా అత్యంత సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీనితో క్రికెటర్లు, ఫ్యాన్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read Also ; ఈ సాలా కప్ నమ్దే.. వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా ఆర్‌సీబీ

రోడ్డుపైనే గంటపాటు నిలిచిన క్రికెటర్లు.. షార్ట్ సర్క్యూటే కారణమా?

మంటలు భారీగా వ్యాపించడంతో గుజరాత్ ఆటగాళ్లు, సిబ్బంది ప్రత్యామ్నాయ వాహనాలు వచ్చే వరకు దాదాపు గంటకు పైగా రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బస్సులోని ఎయిర్ కండిషనర్ (AC) వైరింగ్‌లో చోటుచేసుకున్న సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్‌లో రన్నరప్‌గా నిలిచిన నిరాశలో ఉన్న ఆటగాళ్లకు ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ అగ్నిప్రమాదంపై బీసీసీఐ మరియు స్థానిక పోలీసులు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు; బస్సు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను, సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఈ ఏడాది IPL ఎంతో ప్రత్యేకం ..ఎలాగో తెలుసా ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha