Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుజరాత్ టైటాన్స్ తుఫాన్ బ్యాటింగ్.. 229 సీఎస్‌కేకు భారీ లక్ష్యం

గుజరాత్ టైటాన్స్ తుఫాన్ బ్యాటింగ్.. 229 సీఎస్‌కేకు భారీ లక్ష్యం

వార్త 3 days ago

GT vs CSK Live Score : గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌పై భారీ స్కోర్ నమోదు చేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు.

సాయి సుదర్శన్ 53 బంతుల్లో 84 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 37 బంతుల్లో 64 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి సీఎస్‌కే బౌలర్లపై దూకుడుగా ఆడి భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

గిల్, సుదర్శన్ అద్భుత ఆరంభం

పవర్‌ప్లే నుంచే గుజరాత్ టైటాన్స్ దూకుడు ప్రారంభించింది. సుదర్శన్, గిల్ ఇద్దరూ బౌండరీలు బాదుతూ పరుగుల వేగాన్ని తగ్గనివ్వలేదు. సుదర్శన్ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ ప్రారంభంలో తాను పూర్తి స్థాయిలో లేనప్పటికీ గిల్ అద్భుతంగా ఆడాడని తెలిపాడు. తాము వ్యక్తిగత స్కోర్ల కోసం కాకుండా జట్టు కోసం భాగస్వామ్యంగా ఆడతామని చెప్పాడు. ఐపీఎల్‌లో వరుసగా ఐదు సార్లు యాభైకి పైగా పరుగులు చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.

Read also : India vs Afghanistan 2026:ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు జట్లను ప్రకటించిన BCCI

 GT vs CSK Live Score

బట్లర్ వేగవంతమైన ముగింపు

ఇన్నింగ్స్ చివర్లో జోస్ బట్లర్ తన దూకుడు బ్యాటింగ్‌తో సీఎస్‌కే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లో అజేయంగా 57 పరుగులు చేసి జట్టును 220కి పైగా తీసుకెళ్లాడు. చివరి ఓవర్లలో రాహుల్ తెవాటియా రన్‌అవుట్ కాగా, వాషింగ్టన్ సుందర్ వేగంగా 7 పరుగులు చేసి ఔటయ్యాడు. అయినప్పటికీ బట్లర్ చివరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.

సీఎస్‌కేకు భారీ లక్ష్యం

ముందుగా టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే గుజరాత్ టాప్ ఆర్డర్ దూకుడుకు సీఎస్‌కే బౌలర్లు సమాధానం కనుగొనలేకపోయారు. చివరకు గుజరాత్ టైటాన్స్ 229/4 భారీ స్కోర్ నమోదు చేసింది. ఇప్పుడు ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు సీఎస్‌కే బ్యాటర్లు ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

లఖ్‌నవూపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha