ఒడిశా ప్రభుత్వం, ప్రజారోగ్యాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా, పొగాకు, నికోటిన్ కలిగిన అన్ని రకాల ఉత్పత్తులపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ మేరకు బుధవారం (జనవరి 21) రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో గుట్కా (Gutka), పాన్ మసాలా, జర్దా, ఖైనీ వంటి ఉత్పత్తులు ఇకపై ఒడిశా రాష్ట్రంలో ఎక్కడా అందుబాటులో ఉండవు. ఇప్పటికే ఒడిశాలో పొగాకు, నికోటిన్ ఉత్పత్తులపై నిషేధం ఉంది. అయితే గతంలో ఉన్న ఉత్తర్వులను సవరించింది.
Chhattisgarh steel plant blast : స్టీల్ ప్లాంట్‌లో పేలుడు, ఏడుగురు కార్మికులు సజీవ దహనం!

వేర్వేరు ప్యాకెట్ల అమ్మకం
2013లో ఉన్న పాత నిబంధనలను రద్దు చేస్తూ.. కొత్తగా నోటిఫికేషన్ (జీఓ నంబర్ 2065) జారీ చేశారు. ఈ మేరకు ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఉన్న చట్టపరమైన లొసుగులను తొలగించి, నిబంధనలను మరింత కఠినతరం చేశారు.
ఇప్పటివరకు కొన్ని సంస్థలు పొగాకు, పాన్ మసాలాను విడివిడిగా విక్రయించి నిబంధనల నుంచి తప్పుకునేవి.ఇప్పుడు అలాంటి వేర్వేరు ప్యాకెట్ల అమ్మకం కూడా చట్టవిరుద్ధం కానుంది.పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల కారణంగా క్యాన్సర్ ముప్పు వస్తుందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Traffic Rules: 5 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే డ్రైవర్ల లైసెన్సు రద్దు

