Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్యాడ్జెట్లకు బానిసలు కావొద్దు.. సెలవులను ఎంజాయ్ చేయండి!

గ్యాడ్జెట్లకు బానిసలు కావొద్దు.. సెలవులను ఎంజాయ్ చేయండి!

వార్త 2 months ago

CP Sajjanar: వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థులు డిజిటల్ వ్యసనానికి (Digital Addiction) లోనయ్యే ప్రమాదం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.

సెలవుల వినోదం కాస్తా గ్యాడ్జెట్లకు బానిసలుగా మార్చకూడదని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా (X) ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ అప్రమత్తం చేశారు.

Read Also: Telangana: ఇక పుస్తకాల కంటే 'ప్రాక్టికల్స్'కే ప్రాధాన్యం.. ఇంటర్న్‌షిప్ తప్పనిసరి!

CP Sajjanar: గ్యాడ్జెట్ల కంటే మీ సమయమే మిన్న

చాలామంది తల్లిదండ్రులు పిల్లలు అల్లరి చేస్తున్నారని లేదా తమకు పని ఉందనే సాకుతో ఫోన్లు, టాబ్లెట్లు చేతికి ఇస్తుంటారని, ఇది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని సజ్జనార్ పేర్కొన్నారు. “ఈ సెలవుల్లో మీ పిల్లలకు ఖరీదైన గ్యాడ్జెట్లు కానుకగా ఇవ్వకండి.. మీ అమూల్యమైన సమయాన్ని వారికి కేటాయించండి” అని ఆయన పిలుపునిచ్చారు.

తల్లిదండ్రుల బాధ్యత ఇదే!

పిల్లలు ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనే అంశాలపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. సెలవుల్లో పిల్లలను ఆటపాటలు, పుస్తక పఠనం మరియు సృజనాత్మక పనుల వైపు మళ్లించాలని, వారిలో సామాజిక స్పృహ పెంచేలా సమయం గడపాలని ఆయన కోరారు. డిజిటల్ వ్యసనం వల్ల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కమిషనర్ హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గల్ఫ్ యుద్ధం దెబ్బ.. భారీగా పడిపోయిన ఉల్లి, టమాటా ధరలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha