Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్యాస్‌ సిలిండర్‌ పేలి దంపతులకు తీవ్ర గాయాలు

గ్యాస్‌ సిలిండర్‌ పేలి దంపతులకు తీవ్ర గాయాలు

వార్త 3 days ago

Ramagundam Cylinder Blast: రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని పోతనకాలనీ 83వ బ్లాక్‌ క్వార్టర్‌ నంబరు 1151లో ఆదివారం ప్రమాదవశాత్తు వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలింది.

ఈ ప్రమాదంలో సింగరేణి కార్మికుడు యాదవనేని వసంత్‌తోపాటు ఆయన భార్య విజ్ఞత తీవ్రంగా గాయపడ్డారు. వసంత్‌ సింగరేణిలోని వకీల్‌పల్లి గనిలో జనరల్‌ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Read Also : Telangana School Holidays: బడి పిల్లలకు ఎగిరిగంతేసే గుడ్ న్యూస్

 Couple sustains severe injuries in gas cylinder explosion.

Ramagundam Cylinder Blast: ప్రమాదం జరిగిన తీరు

శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న వసంత్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. ఇదే సమయంలో ఇంట్లో నిల్వ ఉంచిన అదనపు వంటగ్యాస్‌ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ కావడంతో అది ఇంటి అంతటా వ్యాపించింది. తలుపులు, కిటికీలు మూసి ఉండటంతో గ్యాస్‌ సాంద్రత మరింత పెరిగింది. తెల్లవారుజామున గ్యాస్‌ వాసనను గుర్తించిన కుటుంబ సభ్యులు పరిస్థితిని అర్థం చేసుకునేలోపే హాల్‌లో లైట్‌ ఆన్‌ చేయడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి.

తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలింపు

క్షణాల్లో మంటలు అలుముకోవడంతో విజ్ఞతతో పాటు బాత్‌రూమ్‌లో ఉన్న వసంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కేకలు విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం దంపతులను గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విజ్ఞతకు, వసంత్‌కు తీవ్ర గాయాలవ్వడం, పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బెడ్‌రూమ్‌లో ఉన్న వారి ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ భారీ పేలుడు దాటికి ఇంట్లోని సామగ్రి మొత్తం కాలిబూడిదైంది.

ఐటీఐ విద్యార్థులకు అదిరిపోయే అప్డేట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha