Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ-కేవైసీ చేయించకుంటే సిలిండర్ సరఫరా బంద్!

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ-కేవైసీ చేయించకుంటే సిలిండర్ సరఫరా బంద్!

వార్త 1 week ago

LPG Gas e-KYC: ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక అలర్ట్ జారీ చేశాయి. గృహ అవసరాల సిలిండర్ల వినియోగంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు చేపట్టిన ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది.

బోగస్ కనెక్షన్లను తొలగించడం, వాణిజ్యపరమైన వ్యాపారాలకు గృహ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 30 లక్షల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం 70 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. మిగిలిన 30 శాతం మంది వినియోగదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఆయిల్ కంపెనీలు కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తున్నాయి. గతంలో ఈ గడువును పొడిగించినట్లే, ఇప్పుడు కూడా పొడిగిస్తారనే భావనతో చాలామంది ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: Adilabad Airfield: ఆదిలాబాద్ ఎయిర్‌ఫీల్డ్‌కు రూ.2,278.14 కోట్లు మంజూరు!

 Alert for gas consumers: Cylinder supply will be stopped if e-KYC is not completed.

LPG Gas e-KYC: సిలిండర్ల సరఫరా నిలిపివేసేందుకు సిద్ధమైన ఆయిల్ కంపెనీలు

చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ వెండర్లు వ్యాపారాల కోసం గృహ అవసరాల సిలిండర్లను చట్టవిరుద్ధంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మార్కెట్‌లో గ్యాస్ సరఫరా కొరత కూడా ఉన్న నేపథ్యంలో, అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు ఈ-కేవైసీని ఒక ఆయుధంగా వాడాలని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే, నిర్ణీత గడువులోగా ఈ-కేవైసీ పూర్తికాని కనెక్షన్లకు సిలిండర్ల బుకింగ్ మరియు సరఫరాను పూర్తిగా నిలిపివేసే అవకాశం కనిపిస్తోంది.

ఆన్‌లైన్‌లో సులభంగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోండి

గ్యాస్ కనెక్షన్ నిలిచిపోకుండా ఉండాలంటే వినియోగదారులు వెంటనే తమ ఈ-కేవైసీని పూర్తి చేసుకోవాలి. గ్యాస్ ఏజెన్సీకి నేరుగా వెళ్లి బయోమెట్రిక్ ఇవ్వడం ద్వారా లేదా, సంబంధిత గ్యాస్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారా ఇంట్లోనే సులభంగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకుని ఆటంకం లేకుండా గ్యాస్ పొందేందుకు సహకరించండి.

Epaper: epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha