Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
H-1B వీసాల విషయంలో ట్రంప్ కు బిగ్ షాక్

H-1B వీసాల విషయంలో ట్రంప్ కు బిగ్ షాక్

వార్త 2 months ago

H-1B Visa : విదేశీ ఐటీ నిపుణులు, ముఖ్యంగా భారతీయ టెక్కీలను టార్గెట్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక వివాదాస్పద నిర్ణయానికి యూఎస్ న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

విదేశీ ఉద్యోగులకు జారీ చేసే ప్రతి కొత్త H-1B వీసాపై ఏకంగా లక్ష డాలర్ల (దాదాపు 83 లక్షల రూపాయల) భారీ రుసుమును విధించాలన్న ట్రంప్ పరిపాలనా విభాగానికి (Trump Administration) సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమెరికా ఫెడరల్ కోర్టు తాజాగా కొట్టేసింది. బోస్టన్‌లోని డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ ఈ ప్రతిపాదిత రుసుమును పూర్తిగా చట్టవిరుద్ధమైనదిగా తేల్చి చెప్పారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు లేదా ఇలాంటి భారీ ఫీజులను ఆమోదించే అధికారం కేవలం యూఎస్ కాంగ్రెస్‌కు (US Congress) మాత్రమే ఉంటుందని, అధ్యక్షుడి నిర్ణయం చట్టసభ పరిధిని అతిక్రమించడమేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

అటార్నీ జనరల్స్ ఉమ్మడి పోరాటం

అమెరికా ఆర్థిక వ్యవస్థను మరియు ఐటీ కంపెనీల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న ఈ లక్ష డాలర్ల వీసా ఫీజును సవాలు చేస్తూ యునైటెడ్ స్టేట్స్‌లోని దాదాపు 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఉమ్మడిగా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సమగ్ర విచారణ జరిపిన కోర్టు, ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంపై స్టే విధిస్తూ తుది తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన ఈ మైలురాయి లాంటి తీర్పుతో గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి సిలికాన్ వ్యాలీ దిగ్గజ సంస్థలతో పాటు అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణులకు చాలా పెద్ద ఉపశమనం లభించింది. ఒకవేళ ఈ ఫీజు గనుక అమల్లోకి వచ్చి ఉంటే, విదేశీ ప్రతిభావంతులను నియమించుకోవడం కంపెనీలకు పెను భారంగా మారి, హెచ్-1బి వీసా ప్రక్రియ పూర్తిగా సంక్షోభంలో పడిపోయేదని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తలు.. బాంబులతో ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha