Rajamouli : 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) చిత్రం అంతర్జాతీయంగా ప్రభంజనం సృష్టించి ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తర్వాత తనకు హాలీవుడ్ నుంచి అనేక ప్రతిపాదనలు వచ్చాయని రాజమౌళి వెల్లడించారు.
అయితే, అప్పటికే తాను మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ (Varanasi) ప్రాజెక్ట్ పనులను ప్రారంభించానని వివరించారు. “నా పనితీరు ప్రకారం ఒకే సమయంలో రెండు మూడు ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేను. పూర్తిగా ఒక ప్రాజెక్ట్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తాను. అందుకే ఆ సమయంలో వచ్చిన హాలీవుడ్ ఆఫర్లను పక్కన పెట్టాల్సి వచ్చింది. కానీ, వాటిలో కొన్ని అవకాశాలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి” అని ఆయన స్పష్టం చేశారు.

హాలీవుడ్‌లో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది - సావో పౌలో ఫెస్టివల్‌లో జక్కన్న వ్యాఖ్యలు
హాలీవుడ్ చిత్ర నిర్మాణ శైలి, అక్కడి పక్కా ప్రణాళికాబద్ధమైన వర్క్ కల్చర్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని రాజమౌళి తెలిపారు. ఆ నిర్మాణ విధానం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, అందుకే తన కెరీర్‌లో కనీసం ఒక్క హాలీవుడ్ చిత్రమైనా చేయాలని బలంగా కోరుకుంటున్నట్లు ఆయన తన ఆకాంక్షను బయటపెట్టారు. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఉన్న ‘వారణాసి’ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే తాను హాలీవుడ్ ఆఫర్లను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

