రాయలసీమ ప్రాంత రూపురేఖలను మార్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు కరవు కాటకాలతో అల్లాడే రాయలసీమను దేశంలోనే ప్రముఖ 'హార్టికల్చర్ హబ్' (ఉద్యానవన పంటల కేంద్రం)గా తీర్చిదిద్దేందుకు ఒక సమీకృత ఉద్యాన అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం రాయలసీమ వ్యాప్తంగా 8.41 లక్షల హెక్టార్లలో రకరకాల ఉద్యాన పంటలు సాగవుతుండగా, రాబోయే 2030 సంవత్సరం నాటికి దీనిని ఏకంగా 14.41 లక్షల హెక్టార్లకు విస్తరించాలని ప్రభుత్వం ఒక భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ ప్రణాళిక ద్వారా పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించి, ప్రాంతీయంగా పంటల ఉత్పాదకతను అంతర్జాతీయ స్థాయికి పెంచేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది.
Read Also : మత్స్యకారులకు రూ.20,000 భృతి!

లక్ష కోట్ల పెట్టుబడులు.. 9 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా!
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును విజయవంతం చేయడం కోసం అటు ప్రభుత్వ నిధులు, ఇటు ప్రైవేటు భాగస్వామ్యాలు మరియు పెట్టుబడుల ద్వారా మొత్తంగా ₹లక్ష కోట్లు వెచ్చించనున్నట్లు యంత్రాంగం వెల్లడించింది. కేవలం సాగు విస్తీర్ణం పెంచడమే కాకుండా, పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించేందుకు కోల్డ్ స్టోరేజ్ లింకులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మరియు అంతర్జాతీయ ఎగుమతి కేంద్రాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ మెగా హార్టికల్చర్ డ్రైవ్ వల్ల రాయలసీమ పరిధిలోని జిల్లాల్లో దాదాపు 9 లక్షల మంది నిరుద్యోగులకు మరియు స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టు గనుక అనుకున్న సమయానికి పూర్తయితే, రాయలసీమ రైతుల ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఏపీ సర్కార్ దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు

