Hyderabad Golconda Hostel: హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపే అమానుష ఘటన ఒకటి వెలుగుచూసింది. ఒక ప్రైవేట్ హాస్టల్ వాష్‌రూమ్‌లో యువతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
అయితే, సమాజానికి భయపడిందో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ, పుట్టిన వెంటనే ఆ పసికందును వాష్‌రూమ్ వెంటిలేటర్ కిటికీలోంచి బయటకు విసిరేసింది. ఈ దారుణ ఘటనలో ఆ నవజాత శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Read Also : Paddy Bonus: ఆ 7 రకాల సన్న వడ్లకే రూ.500 బోనస్.. లిస్ట్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం!
Childbirth in hostel… Young woman throws newborn off the ventilator.
Hyderabad Golconda Hostel: నిలోఫర్ ఆసుపత్రిలో యువతికి చికిత్స
ప్రసవం తర్వాత తీవ్ర రక్తస్రావం కావడం, ఆరోగ్యం క్షీణించడంతో సదరు యువతిని హాస్టల్ సిబ్బంది తక్షణమే నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సదరు యువతి గర్భవతి అనే విషయం తమకు అస్సలు తెలియదని, ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పులు గమనించలేదని కళాశాల, హాస్టల్ యాజమాన్యం చెబుతోంది. అయితే ఇంత పెద్ద విషయాన్ని హాస్టల్ సిబ్బంది ఎలా గమనించలేకపోయారనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
బావపైనే కుటుంబ సభ్యుల అనుమానం
ఈ ఘటనపై యువతి కుటుంబ సభ్యులు స్పందించారు. తన సొంత బావ కారణంగానే ఆ యువతి గర్భవతి అయి ఉండవచ్చని వారు గట్టిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, ప్రాథమిక ఆధారాల ప్రకారం పోలీసులు ఆ దిశగా విచారణను వేగవంతం చేశారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

