Dailyhunt
హాట్ టాపిక్ గా రన్నరప్ తనూజ రెమ్యునరేషన్

హాట్ టాపిక్ గా రన్నరప్ తనూజ రెమ్యునరేషన్

వార్త 3 months ago

నూజ పుట్టస్వామి.. బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి నుంచి అత్యధిక ఓటింగ్ తో టైటిల్ రేసులో దూసుకుపోయిన పేరు. ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు..

ఆ తర్వాత చాలాకాలం పాటు టీవీకి దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత కుకు విత్ జాతిరత్నాలు షోలో పాల్గొని ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టింది. మొదటి వారం నుంచి ఊహించని విధంగా ఎక్కువ ఓటింగ్ రాబడుతూ టాప్ 1లో సత్తా చాటింది.

Read Also:Bigg Boss 9 : బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల

తన ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు

చివరి నిమిషం వరకు విన్నర్ అయ్యేందుకు అత్యధిక ఓటింగ్ అందుకుంది. కానీ అందరూ ఊహించినట్లే స్వల్ప తేడాతో కళ్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. విన్నర్ గా రూ. 35 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు కళ్యాణ్. అయితే విజేతగా ఏమాత్రం తీసిపోని స్థాయిలో రన్నర్ తనూజ సైతం ఎక్కువగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

 Runner-up Tanuja’s remuneration has become a hot topic

సమాచారం ప్రకారం, తనూజకు వారానికి సుమారు రూ.2.8 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట. అలా 15 వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగిన ఆమె మొత్తం రూ.42 లక్షలకు పైగా సంపాదించినట్టు తెలుస్తోంది.ఇక తనూజ తన ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు చెప్పింది. “తెలుగు ప్రజలందరికీ థాంక్యూ సోమచ్.. మీరు లేకుండా నేను లేను.. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే కేవలం మీ వల్ల.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. థాంక్యూ ఫర్ ఎవ్రిథింగ్.. థాంక్యూ నాగ్ సార్..” అంటూ తనూజ చెప్పుకొచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha