Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ ఆటోలో క్లాసెన్ షికారు.. 'కాటేరమ్మ కొడుకు' సింప్లిసిటీ చూశారా?

హైదరాబాద్ ఆటోలో క్లాసెన్ షికారు.. 'కాటేరమ్మ కొడుకు' సింప్లిసిటీ చూశారా?

వార్త 3 weeks ago

Heinrich Klaasen: హైదరాబాద్ అభిమానులకు తమ 'కాటేరమ్మ కొడుకు' క్లాసెన్ అంటే ఎంత ఇష్టమో, ఆయనకు కూడా ఈ నగరం అంటే అంతే ఇష్టమని మరోసారి నిరూపితమైంది.

గ్రౌండ్‌లో సిక్సర్ల సునామీ సృష్టించే క్లాసెన్, బయట ఇంత సింపుల్‌గా ఆటోలో తిరగడం నిజంగా విశేషం.

Read Also:RR vs DC: జడ్డూ వర్సెస్ కుల్దీప్.. మైదానంలోనే ఒకరినొకరు నెట్టేసుకున్న స్టార్ ప్లేయర్స్!

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తన సింప్లిసిటీతో తెలుగు అభిమానుల మనసు గెలుచుకున్నారు. మైదానంలో బౌలర్లను ఉతికి ఆరవేసే క్లాసెన్, బయట మాత్రం ఎంతో సాధారణ వ్యక్తిలా కనిపిస్తూ వార్తల్లో నిలిచారు.

Heinrich Klaasen: ఆటోలో కూతురితో కలిసి..

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో 65 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చిన క్లాసెన్, తదుపరి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మ్యాచ్‌ కంటే ముందు లభించిన విరామ సమయాన్ని తన కుటుంబంతో గడిపారు. తన ముద్దుల కుమార్తె లాయా క్లాసెన్ తో కలిసి హైదరాబాద్ వీధుల్లో ఆటోలో ప్రయాణించారు. స్టార్ హోదా ఉన్నప్పటికీ, ఎలాంటి ఆడంబరాలు లేకుండా సామాన్యుడిలా ఆటోలో కూర్చుని నగర అందాలను ఆస్వాదిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కేఎల్ రాహుల్ 'సిక్సర్ల' సెన్సేషన్: IPLలో తొలి ఇండియన్ ఓపెనర్‌గా రికార్డు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha