Traffic Restrictions For Ganesh Immersion : ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 10 గంటల వరకు నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన ఊరేగింపు చార్మినార్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ చేరనుంది. ప్రధాన నిమజ్జన మార్గాల్లో ఇతర వాహనాలకు అనుమతి లేదు. నగరంలో ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లేవారు ఇన్నర్ రింగ్ రోడ్, పంజాగుట్ట-బేగంపేట మార్గాలను లేదా ఔటర్ రింగ్ రోడ్ (ORR)ను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాలను పూర్తిగా నివారించి పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఓఆర్ఆర్ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
Depression : తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Traffic Restrictions For Ganesh Immersion
Traffic Restrictions For Ganesh Immersion : ఆర్టీసీ వాహనాలను సైతం మళ్లించనున్న అధికారులు
గణేశ్ విగ్రహాలను తరలించే వాహనాలు మినహా ప్రధాన ఊరేగింపు మార్గంలో ఇతర వాహనాలను అనుమతించరు. ప్రధాన రూట్లకు అనుసంధానంగా ఉన్న రహదారుల నుంచి కూడా వాహనాలను పలు ప్రాంతాల్లో మళ్లిస్తారు. ఖైరతాబాద్ జోన్‌లో అమీర్‌పేట్ వై జంక్షన్, పంజాగుట్ట ఎక్స్‌రోడ్, మోనప్ప జంక్షన్, వీవీ స్టాచ్యూ, నెక్లెస్ రోడ్, రవీంద్ర భారతి, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, మింట్ లేన్, ట్యాంక్‌బండ్ ఫ్లైఓవర్, అంబేడ్కర్ ఓల్డ్ స్టాచ్యూ, ప్రింటింగ్ ప్రెస్, నాంపల్లి టీ జంక్షన్, హిమాయత్‌నగర్ వై జంక్షన్, రాంగ్‌మహల్ వై జంక్షన్ తదితర ప్రాంతాల్లో డైవర్షన్లు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. వీటితో పాటు ఆర్టీసీ బస్సులను సైతం మళ్లించనున్నారు.
మహిళా కమిషన్ కొత్త చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. నేడు ప్రమాణ స్వీకారం

