Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ లో కొత్త LPG కనెక్షన్ తీసుకోవాలంటే చుక్కలే !!

హైదరాబాద్ లో కొత్త LPG కనెక్షన్ తీసుకోవాలంటే చుక్కలే !!

వార్త 3 days ago

LPG Connection : భాగ్యనగరంలో కొత్తగా గ్యాస్ కనెక్షన్ పొందాలనుకుంటున్న వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ముడి చమురు సరఫరా అడ్డంకుల కారణాల దృష్ట్యా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) కొత్త డొమెస్టిక్ ఎల్‌పీజీ కనెక్షన్ల జారీపై తాత్కాలిక నిలిపివేత విధించాయని స్థానిక గ్యాస్ ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ నిర్ణయం ప్రభావంతో ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా హైదరాబాద్‌కు కొత్తగా వచ్చిన కుటుంబాలు, ఇప్పుడే పెళ్లయిన నవదంపతులు మరియు బ్యాచిలర్లు వంటగ్యాస్ కనెక్షన్ దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొత్త కనెక్షన్ల కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

రెండో సిలిండర్ నిలిపివేత: హోటల్ తిండిపై ఆధారపడుతున్న జనం

కొత్త కనెక్షన్ల సమస్యే కాకుండా, ఇప్పటికే సింగిల్ సిలిండర్ కనెక్షన్ ఉండి రెండో సిలిండర్ (డబుల్ సిలిండర్) కోసం దరఖాస్తు చేసుకున్న పాత వినియోగదారులకు కూడా ఏజెన్సీలు నిరాశే మిగుల్చుతున్నాయి. ప్రస్తుత గ్యాస్ కొరత రీత్యా అదనపు సిలిండర్ల జారీని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు ఏజెన్సీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. దీంతో గ్యాస్ పూర్తయిన సమయంలో రీఫిల్ సిలిండర్ వచ్చేవరకు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, రోజువారీ వంట కోసం ఇండక్షన్ స్టవ్‌లు లేదా బయటి తిండిపై ఆధారపడాల్సి వస్తోందని నగరవాసులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే యువతకు తెలంగాణ ప్రభుత్వ బంపర్ ఆఫర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha