Ajith Reddy: హైదరాబాద్ నగర రవాణా రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అదనపు మేనేజింగ్ డైరెక్టర్‌గా సీనియర్ అధికారి బి.
అజిత్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శనివారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.

‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సీఈఓగా అదనపు బాధ్యతలు
బి. అజిత్ రెడ్డి 2012 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ (IDES) అధికారి. ఆయన ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా సేవలు అందిస్తున్నారు. ఆ బాధ్యతలతో పాటుగా ఇప్పుడు హెచ్‌ఎంఆర్‌ఎల్ అదనపు ఎండీగా ఆయనకు ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. రాష్ట్రంలో జరిగిన పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాల్లో భాగంగా ఈ మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుతం సర్ఫరాజ్ అహ్మద్ హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
మెట్రో విస్తరణ వేళ కీలక నియామకం
హైదరాబాద్ మెట్రో నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తరుణంలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయి, మెట్రో రెండో దశ (ఫేజ్-2) విస్తరణపై సుదీర్ఘంగా చర్చించారు.
మెట్రో ఫేజ్-1 ముగింపు అంచనాలు, అలాగే ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక ప్రణాళికల రూపకల్పన కోసం ప్రభుత్వం ఇప్పటికే ‘ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్’ (SBI Caps) సంస్థను కన్సల్టెంట్‌గా నియమించింది. ఈ మెట్రో ప్రాజెక్టుల వేగాన్ని పెంచడంలో అజిత్ రెడ్డి నియామకం కీలక పాత్ర పోషించనుంది.
Read hindi news : hindi.vaartha.com
నాకు ఏదైనా జరిగితే బాధ్యత రేవంత్ రెడ్డిదే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు

