Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాదీలకు గుడ్ న్యూస్: రోడ్డుపైకి 100 కొత్త ఆర్టీసీ మినీ బస్సులు!

హైదరాబాదీలకు గుడ్ న్యూస్: రోడ్డుపైకి 100 కొత్త ఆర్టీసీ మినీ బస్సులు!

వార్త 2 weeks ago

Hyderabad RTC Mini Buses: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరిగిన ప్రయాణికుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC ) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

నగరంలోని శివారు ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంతో మళ్లీ మినీ బస్సులను (Mini Buses) అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Read Also:Telangana ration cards: తెలంగాణలో భారీగా రేషన్ కార్డుల రద్దు

Hyderabad RTC Mini Buses: మినీ బస్సుల పునఃప్రారంభం - ప్రధాన విశేషాలు

ఆర్టీసీ ప్రణాళికల ప్రకారం, తొలి విడతగా 100 కొత్త మినీ బస్సులను నగర రహదారులపైకి తీసుకురానున్నారు. ప్రధాన రహదారులు, కాలనీలు, మరియు మెట్రో స్టేషన్ల మధ్య సజావుగా ప్రయాణించేలా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం వీటిని ఫీడర్ సర్వీస్ మోడల్‌లో నడపనున్నారు. గతంలో చార్మినార్ ప్రాంతంలో నడిపిన మినీ బస్సులు పాతబడిపోవడంతో వాటిని స్క్రాప్ కింద తొలగించారు. ఇప్పుడు సరికొత్త మోడళ్లతో సుఖవంతమైన బస్సులను రంగంలోకి దించుతున్నారు. ‘సెట్విన్’ తరహా చిన్న బస్సులు కావడం వల్ల నగరంలోని ఇరుకైన వీధులు, సందడి గల ప్రాంతాల్లో కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే వీలుంటుంది.

Epaper: epaper.vaartha.com

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికులకు శుభవార్త.. కొత్త సదుపాయాలతో ఊరట

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha