Fish Prasadam2026: ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారి కోసం హైదరాబాద్‌లో ఏటా నిర్వహించే ప్రసిద్ధ బత్తిని సోదరుల 'చేప ప్రసాదం' పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మృగశిర కార్తెను పురస్కరించుకుని ఇచ్చే ఈ ప్రసాదాన్ని ఈసారి రేపు (జూన్ 8) రాత్రి 9 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. సాధారణంగా ఉదయమే ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ, ఈ ఏడాది మృగశిర కార్తె రాత్రి వేళ ప్రవేశిస్తుండటంతో సమయాన్ని మార్చినట్లు నిర్వాహక సభ్యులు వెల్లడించారు. ఈ పంపిణీ జూన్ 9వ తేదీ రాత్రి వరకు నాన్‌స్టాప్‌గా సాగనుంది.

రంగంలోకి మంత్రులు.. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!
ఈ వినూత్న కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్వయంగా నాంపల్లి గ్రౌండ్స్‌ను సందర్శించి ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున భక్తుల సౌకర్యార్థం కూలర్లు, ఫ్యాన్లు అమర్చారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు, సీపీఆర్ (CPR) ట్రైనింగ్ ఉన్న బృందాలను రంగంలోకి దించారు. భద్రతా పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా పోలీసులు, షీ టీమ్స్ (She Teams), సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు.
Read also: TG School Academic Calendar:తెలంగాణ స్కూల్స్ కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల
ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు:
చేప ప్రసాదం పంపిణీ దృష్ట్యా నాంపల్లి పరిసర ప్రాంతాల్లో జూన్ 8 ఉదయం 6 గంటల నుంచి జూన్ 9 రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీసులు తెలిపారు.
ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వ్యాన్లలో వచ్చే భక్తులు గాంధీభవన్ లేదా గృహకల్ప వద్ద దిగాల్సి ఉంటుంది. ఆటోల్లో వచ్చే ప్రయాణికులను షెజాన్ హోటల్ వద్ద డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ గ్రౌండ్స్‌కు చేరుకోవాలి. సాధారణ వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ విభాగం సూచించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:

