Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు అనుమానితులు

హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు అనుమానితులు

వార్త 1 week ago

Ebola: హైదరాబాద్‌ నగరంలో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. ఎబోలా తరహా ప్రాథమిక లక్షణాలతో ముగ్గురు వ్యక్తులు సికింద్రాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

ఈ తాజా పరిణామంతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బాధితులను వెంటనే గాంధీలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి, నిపుణులైన వైద్య బృందం నిరంతర పర్యవేక్షణలో ఉంచారు.

Read also: Telangana Anganwadi : అంగన్వాడీలకు వేసవి సెలవులు పొడిగింపు?

 EbolaSuspects

అపోలో నుంచి గాంధీకి రిఫర్.. ఒకే విమానంలో ప్రయాణం

శుక్రవారం (జూన్ 5) ఉదయం ఎబోలా అనుమానిత లక్షణాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. వారి పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన అపోలో వైద్యులు, మెరుగైన పరీక్షల కోసం వారిని తక్షణమే గాంధీ ఆసుపత్రికి పంపించారు. దీంతో గాంధీలో చేరిన ఎబోలా అనుమానితుల సంఖ్య మూడుకు చేరింది. కాగా, ప్రాథమిక విచారణలో ఈ ముగ్గురు బాధితులు ఒకే అంతర్జాతీయ విమానంలో ప్రయాణించి హైదరాబాద్‌కు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో ఆ విమానంలో ప్రయాణించిన మిగిలిన ప్రయాణికుల వివరాలను సేకరించేందుకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు.

Ebola: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో థర్మల్ స్క్రీనింగ్.. సూడాన్ నుంచి రాక

అంతకుముందు గురువారం నాడు సూడాన్ దేశం నుంచి ఇథియోపియా మీదుగా శంషాబాద్ (RGIA) విమానాశ్రయానికి చేరుకున్న ఒక 30 ఏళ్ల ప్రయాణికుడిని ఎయిర్‌పోర్ట్ మెడికల్ టీమ్ గుర్తించింది. విమానాశ్రయంలో నిర్వహించిన థర్మల్ స్క్రీనింగ్‌లో అతనికి 100 డిగ్రీల తీవ్ర జ్వరం ఉన్నట్లు తేలింది. ఇటీవలి కాలంలో అతడు ఎబోలా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి ఆఫ్రికా దేశాలలో పర్యటించినట్లు తేలడంతో, అధికారులు ముందుజాగ్రత్త చర్యగా అతడిని అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్‌కు తరలించారు.

పుణె ‘ఎన్ఐవీ’ ల్యాబ్‌కు నమూనాలు.. ఆందోళన వద్దు అన్న వైద్యులు

ప్రస్తుతానికి గాంధీలో చికిత్స పొందుతున్న ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎబోలా వైరస్ తీవ్ర రూపం దాల్చితే కనిపించే అంతర్గత, బాహ్య రక్తస్రావం (Bleeding) లేదా తీవ్రమైన వాంతులు వంటి లక్షణాలు ప్రస్తుతానికి ఎవరిలోనూ లేవని వైద్యులు స్పష్టం చేశారు. బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలను తుది నిర్ధారణ పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ల్యాబ్‌కు పంపించారు.

ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, విమానాశ్రయాలు మరియు ఆసుపత్రుల్లో అన్ని రకాల ముందస్తు నివారణ చర్యలు తీసుకున్నామని వైద్యాధికారులు భరోసా ఇచ్చారు. పుణె ల్యాబ్ నుంచి వచ్చే నివేదికల ఆధారంగా తదుపరి వైద్య విధానాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

మిర్యాలగూడలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha