Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో మందుబాబుల వేట..474 మంది పట్టివేత!

హైదరాబాద్‌లో మందుబాబుల వేట..474 మంది పట్టివేత!

వార్త 6 days ago

Hyderabad Drunken Drive Raids: జంట నగరాలలో మందు బాబుల భరతం పట్టేందుకు డ్రంకన్ డ్రైవ్ దాడులు కొనసాగుతూనే వున్నాయి. శుక్రవారం, శనివారం రాత్రుల్లో ట్రాఫిక్ పోలీసులు పలు చోట్ల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ దాడుల్లో మొత్తం 474 మంది మందు బాబులు పట్టుబడ్డారు.

వీరిలో 417 మంది ద్విచక్ర వాహనదారులు, 24 మంది ఆటో డ్రైవర్లు, 33 మంది కార్లతో పాటు భారీ వాహనాల డ్రైవర్లు వున్నారు. పట్టుబడ్డ వారిలో 103 మంది 30 నుంచి 50 పాయింట్ల వరకు వుండగా 188 మంది 51 నుంచి 100 పాయింట్ల వరకు, 100 మంది 101 నుంచి 150 పాయింట్ల వరకు, 44 మంది 151 నుంచి 200 పాయింట్ల వరకు, 19 మంది 201 నుంచి 250 పాయింట్ల వరకు, ఎనిమిది మంది 251 నుంచి 300 పాయింట్ల వరకు, 12 మంది 300 పాయింట్లకు మించి విపరీతంగా మద్యం సేవించినట్లు తేలింది. వీరిని అరెస్టు చేసి న తరువాత వారి వా హనాలు జప్తు చేసి, కేసులు నమోదు చేశాక సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. వీరికి కౌన్సిలింగ్ నిర్వహించిన తరు వాత కోర్టుల్లో హాజరు పరు స్తారు. కోర్టులు వీరికి శిక్షలు విధిస్తాయని నగర జాయింట్ ట్రాఫిక్ పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ మీడి యాకు తెలిపారు. జంట నగరాలలో డ్రంకన్ డ్రైవ్ దాడులు నిరంతరం కొనసాగు తాయని, వీటిని పూర్తిస్థాయిలో అరికడతామని ఆయన వెల్లడించారు.

Hyderabad Drunken Drive Raids: మల్కాజిగిరి పరిధిలో 318 మంది, సైబరాబాద్లో 283

ఇదిలావుండగా మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 323 మంది మందు బాబులు పట్టు బడ్డారు. వీరిలో 267 మంది ద్విచక్ర వాహనదారులు, 22 మంది ఆటో డ్రైవర్లు, 33 మంది కార్ల డ్రైవర్లు వున్నారు. కాగా సైబరాబాద్ పరిధిలో 300 మందు బాబులు పట్టుబడ్డారు. వీరిలో 253 మంది ద్విచక్ర వాహనదారులు. తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు, 38 మంది కార్ల డ్రైవర్లు, నలుగురు భారీ వాహనాల డ్రైవర్లు ఉన్నారు.

 Hyderabad Traffic Police conducting drunken drive testing using breathalyzers on a digital check post at night

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కేంద్ర నిధులపై తప్పిన సర్కార్ అంచనాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha