Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీ వర్ష సూచన!

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీ వర్ష సూచన!

వార్త 19 hrs ago

Hyderabad Rain Alert: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తీవ్రమైన ఎండల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి, నగరవ్యాప్తంగా మబ్బులు కమ్మేసాయి.

హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది.

రాబోయే కొన్ని గంటల్లో వాతావరణంలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయని అధికారులు తెలిపారు. వర్షం పడే సమయంలో నగరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read Also : HYD RTC bus wrong route: రాంగ్ రూట్ లో వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు బుద్ధి చెప్పిన బైకర్

 Weather takes a sudden turn in Hyderabad… Heavy rain forecast!

Hyderabad Rain Alert: సిటీలో మొదలైన చినుకులు.. ట్రాఫిక్‌కు అంతరాయం?

ఇప్పటికే హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌తో పాటు సిటీలోని పలు కీలక ప్రాంతాల్లో వాన చినుకులు మొదలయ్యాయి. ఆకాశం పూర్తిగా నల్లటి మబ్బులతో నిండిపోవడంతో పగటి పూటే చీకట్లు కమ్మేసినట్లు అయింది. అకస్మాత్తుగా కురుస్తున్న ఈ వర్షం కారణంగా రద్దీగా ఉండే జంక్షన్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున పాత భవనాలు, హోర్డింగులు, చెట్ల కింద నిలబడకూడదని మున్సిపల్ అధికారులు (GHMC) నగర ప్రజలను కోరారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు.

హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరితో సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఇదే విధమైన వాతావరణం ఉంటుందని, అక్కడ కూడా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో కొమురవెల్లికి రైలు ప్రయాణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha